APSRTC: అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఏపీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 281 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. నాలుగు జిల్లాల (చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం) పరిధిలో ఉన్న అప్రెంటిషిప్ ఖాళీలను భర్తీ చేయనుంది. వివిధ ట్రేడ్స్ లో ఐటీఐ పాస్ అయిన వారు ఇందుకు అర్హులు. ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి. అక్టోబర్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. కాకుటూరు నెల్లూరు ఆర్‌టీసీ జోన్‌ల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు..
ప్రకాశం జిల్లాలో 54 ఖాళీలు
నెల్లూరు జిల్లాలో 91 ఖాళీలు
తిరుపతి జిల్లాలో 88 ఖాళీలు
చిత్తూరు జిల్లాలో 48 ఖాళీలు
ట్రేడ్స్:
* డీజిల్ మెకానిక్
* మోటార్ మెకానిక్
*ఎలక్ట్రీషియన్
* వెల్డర్
* పెయింటర్
* మెషినిస్ట్
* ఫిట్టర్
* డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్).
అర్హత:
సంబంధిత ట్రేడ్స్ లో ఐటీఐ పాస్ అయి ఉండాలి.
దరఖాస్తు విధానం:
* ఆన్‌లైన్ లో అప్లయ్ చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
100 రూపాయలు, జీఎస్‌టీ రూ.18.
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరి తేదీ: అక్టోబర్ 4 2025.
ఆన్‌లైన్ లో అప్లయ్ చేసుకున్నాక ఏపీఎస్‌ఆర్‌టీసీ వెబ్‌సైట్ నుంచి రెస్యూమ్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో వివరాలు ఎంటర్ చేసి నోటిఫికేషన్‌లో చూపించిన సర్టిఫికెట్లను జత చేసి వారిచ్చిన అడ్రస్ కు పంపాలి.
సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు పంపాల్సిన అడ్రస్:
ప్రిన్సిపల్, జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్, కాకుటూర్, వెంకచలం మండలం, నెల్లూరు జిల్లా.
సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలు పంపడానికి చివరి తేదీ: అక్టోబర్ 6 2025.
Also Read: ఆర్టీసీలో ఉద్యోగాలు.. జీతం 60వేలు.. మొత్తం పోస్టులు, వయసు, విద్యార్హత పూర్తి వివరాలు..