అప్లయ్ చేశారా? : ఆర్మీ పబ్లిక్ స్కూల్లో  8వేల టీచర్ పోస్టులు

  • Publish Date - September 11, 2019 / 10:35 AM IST

ఆర్మీ పబ్లిక్ స్కూల్ (APS)లో 8వేల టీచర్ పోస్టులు పడ్డాయి. ఆసక్తి గల అభ్యర్థులు టీచర్ పోస్టులకు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 1, 2019 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. సెప్టెంబర్ 22, 2019 వరకు గడువు తేదీ ఉంది. టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అక్టోబర్ 4 నుంచి అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

అక్టోబర్ 19, 20 తేదీల్లో స్ర్కీనింగ్ టెస్టు నిర్వహిస్తారు. అక్టోబర్ 30న టెస్టుకు సంబంధించి ఫలితాలను వెల్లడిస్తారు. స్టేజ్-1 స్ర్కీనింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇందులో టీచింగ్ స్కిల్స్ తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులకు ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. 

విద్యార్హతలు :
* PGT పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు PG డిగ్రీ తో పాటు BEd లో 50శాతం ఉత్తీర్ణత తప్పనిసరి.
* TGT పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు.. గ్రాడ్యుయేట్ లెవల్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు BEdలో 50శాతం ఉత్తీర్ణత తప్పనిసరి. 
* PRT పోస్టుకు అప్లయ్ చేసే అభ్యర్థులు.. గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు BEdలో 50 శాతం మార్కులు లేదా 2ఏళ్ల డిప్లోమా కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
* అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 13 వరకు అభ్యర్థులకు ఆన్ లైన్ మాక్ టెస్టులు నిర్వహిస్తారు. 
* ఆసక్తి గల అభ్యర్థులు టీచర్ పోస్టులకు ఆన్ లైన్‌లో aps-csb.in లేదా www.awesindia.com దరఖాస్తు చేసుకోవచ్చు.