ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రుల అవస్థలు.. స్కూళ్లు నడపలేక యజమాన్యాల్లో ఆందోళన

  • Publish Date - July 7, 2020 / 04:33 PM IST

కోవిడ్-19 షట్‌డౌన్ కారణంగా స్కూళ్లు, కాలేజీలు అన్ని మూతపడ్డాయి. పిల్లల స్కూళ్ల ఫీజులు కట్టలేక ఒకవైపు తల్లిదండ్రులు అవస్థలు పడుతుంటే.. నెలల తరబడి స్కూళ్లు మూతపడి టీచర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. స్కూళ్ల అద్దె ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాయి యజమాన్యాలు. ఫీజులు పెండింగ్‌లో ఉండిపోయాయి. దేశ రాజధానిలో చాలావరకు చిన్న తరహా ప్రైవేటు స్కూల్ యజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దిగువ మధ్యతరగతికి చెందిన విద్యార్థులు, శ్రామిక కుటుంబాల పిల్లలను పోషించడమే కష్టంగా మారింది.

నైరుతి ఢిల్లీలోని ద్వారకాలోని పోచన్‌పూర్‌లో వలస కార్మికుల పిల్లల కోసం మాధురి అగర్వాల్ ఒక ప్రాథమిక పాఠశాలను నడుపుతున్నాడు.. నర్సరీ విద్యార్థులకు నెలకు రూ. 600 ఫీజుగా వసూలు చేస్తున్నాడు. ప్రతి తరగతికి రూ. 50 చొప్పున పెంచేశాడు. ఆ పెంపుతో 300 మంది విద్యార్థులతో స్కూల్ నడుస్తోంది. వారు ఇచ్చిన ఫీజులతో పాఠశాల నిర్వహణ ఖర్చులకు మళ్లించడం జరుగుతోంది. తల్లిదండ్రులలో 99 శాతం మంది కార్మికులు, చిన్న తరహా ఉద్యోగాలు చేస్తుంటారు. చాలామంది తల్లులు ఇంటి పనులు చేస్తుంటారు. లాక్ డౌన్ వ్యవధిలో, ఒక్క పేరెంట్ కూడా ఫీజు చెల్లించలేకపోయారు. ఏప్రిల్ నుంచి ఉపాధ్యాయులను లేదా అద్దెను చెల్లించలేకపోయామని చెప్పారు.

ఖరీదైన ప్రైవేట్ పాఠశాలల మాదిరిగా కాకుండా, చిన్న పాఠశాలలు తక్కువ ఆర్థిక స్థితి కలిగి ఉన్నాయి. వసూలు చేసే ట్యూషన్ ఫీజును కూడా అడగలేని పరిస్థితి. మహమ్మారి తరువాత వచ్చిన ఆర్థిక ఇబ్బందులు, తరువాత లాక్ డౌన్ చాలా మంది తల్లిదండ్రులు ట్యూషన్ ఫీజు చెల్లించటానికి కష్టపడుతున్నారు. నర్సరీ నుండి 12వ తరగతి వరకు తరగతులతో దక్షిణ ఢిల్లీలోని హరి విద్యా భవన్ స్కూల్‌ను నిర్వహిస్తున్న సుశీల్ ధంకర్ ఏప్రిల్‌లో తనకు ఫీజులు వచ్చాయని, తరువాతి నెలల్లో ఏమీ రాలేదని వాపోయాడు.

స్కూళ్లలో తన సిబ్బందికి ఏప్రిల్ జీతాలను చెల్లించాను. మే జీతాలను ఇవ్వలేకపోయానని అందులో తన సొంత డబ్బులను వేతనంలో 50శాతంగా చెల్లించినట్టు చెప్పుకొచ్చాడు. కానీ, జూన్ జీతాలను చెల్లించలేకపోయానని అన్నారు. పాఠశాల తిరిగి ప్రారంభమైన తర్వాత ఫీజులు రావడం ప్రారంభించిన తర్వాత వారి బకాయిలను చెల్లిస్తానని హామీ ఇచ్చానని చెప్పారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు నెలకు రూ .1,000, సీనియర్ సెకండరీ విద్యార్థులకు రూ .2,200 వసూలు చేస్తామని పాఠశాల యజమానులు చేయాల్సి ఉందని అంటున్నాయి.

Read Here>>పెళ్లిలో కూడా వర్క్ ఫ్రమ్ హోం..!