Bank of Baroda has released a notification for 330 posts.
బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలి అనుకునేవారికి బ్యాంకు బరోడా గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి సిద్దమయ్యింది. ఈమేరకు అధికారిక నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. మొత్తం 330 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. వాటిలో అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ & అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పదవులతో పాటు పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా ఆగస్టు 19వ తేదీతో ముగియనుంది. కాబట్టి అర్హత, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ bankofbaroda.in దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హత:
అభ్యర్థులు నిర్దిష్టమైన విద్యా అర్హతలు, పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు రుసుమ:
జనరల్, OBC, EWS అభ్యర్థులు రూ.850, SC, ST, PwD, ESM, మహిళల అభ్యర్థులు రూ.175 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం:
కాంట్రాక్ట్ వ్యవధి:
ఎంపికైన అభ్యర్థులను 5 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు.