Results 2025
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు వచ్చేశాయి. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ ఏడాదిలో 70 శాతం ఉత్తీర్ణత, ఇంటర్ ద్వితీయ ఏడాదిలో 80 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఈ పరీక్షలను మొత్తం 10,17,102 మంది విద్యార్థులు రాశారు. ఫలితాలను 10tv.in, resultsbie.ap.gov.in వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. అలాగే, వాట్సాప్ నంబరు 95523 00009 ద్వారా కూడా ఫలితాలు పొందొచ్చు. ఈ ఏడాది ఫస్టియర్ పరీక్షలు మార్చి 19న ఫస్టియర్ పరీక్షలు ముగియగా, మార్చి 20న సెకండియర్ పరీక్షలు ముగిశాయి.
Also Read: ఇంటర్ తర్వాత ఏయే కోర్సుల్లో చేరవచ్చు.. ఈ కోర్సుల గురించి మీకు తెలుసా?
రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి..
ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు
వాట్సాప్ ద్వారా ఇలా..
లోకేశ్ ట్వీట్
ఎక్స్‌లో ఫలితాలను విడుదల చేసిన లోకేశ్ పలు వివరాలు తెలిపారు. “ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైనందుకు ఆనందంగా ఉంది. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత 70%, రెండో సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 83%గా నమోదైంది. ప్రభుత్వ, ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో ఉత్తీర్ణత శాతం పెరిగింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల (GJCs) లో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69%గా నమోదు కాగా, ఇది గత 10 ఏళ్లలో అత్యధికం. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 47%గా ఉంది, ఇది గత పదేళ్లలో రెండవ అత్యధిక శాతం. ఈ విజయానికి విద్యార్థులు, జూనియర్ అధ్యాపకులు కఠినమైన శ్రమే కారణం.
ఈసారి ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందకండి. మరింత కృషి చేసి, మరింత బలంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాం. ప్రతి విద్యార్థికి శుభాకాంక్షలు. మీరు నిరంతరం నేర్చుకుంటూ, ఎదుగుతూ, విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అని నారా లోకేశ్ అన్నారు.
ఉత్తీర్ణత శాతం వివరాలు