Site icon 10TV Telugu

AP DSC: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఆ రోజున ఫైనల్ కీ వచ్చే అవకాశం.. ఆరోజు నుంచి నియామక పత్రాలు..!

All set for ap dsc exam 2025

AP DSC: ఏపీ డీఎస్సీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ నెల 29 ఫైనల్ కీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆగస్టు 11 వ తేదీ నుంచి 21 వ తేదీ వరకు డీఎస్సీ కౌన్సెలింగ్ ఉంటుంది. సెప్టెంబర్ 5 న నియామక పత్రాలు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 23 రోజుల పాటు (జూన్ 6 నుంచి జూలై 2) డీఎస్సీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 92.90 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు.

మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ కింద మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. మెగా డీఎస్సీలోని అన్ని ఖాళీలకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా.. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అధిక సంఖ్యలోనే అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలను నిర్వహించారు.

Also Read: ట్రైనింగ్ లోనే 50,000 ఇచ్చే జాబ్.. బీటెక్, బీఈ వాళ్లకు బంపర్ ఆఫర్.. వెంటనే అప్లై చేసుకోండి

ఇక డీఎస్సీ ఫలితాల్లో టెట్ స్కోర్ కీలకంగా ఉంటుంది. ఇందులో సాధించే వెయిటేజీని డీఎస్సీ మార్కులకు జత చేస్తారు. ఈ రెండింటి ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాలను జిల్లాల వారీగా విడుదల చేస్తారు.

ఈ మెగా డీఎస్సీలో 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనుంది ప్రభుత్వం. వీటిలో జిల్లా స్థాయిలో 14,088 పోస్టులున్నాయి. ఇందులో అన్ని రకాల ఎస్జీటీ పోస్టులు 6,599 ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్లు 7,487.. వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు కలిపి 14,088 పోస్టులున్నాయి. ఇక రాష్ట్ర, జోనల్‌ స్థాయిలో 2,259 పోస్టులు భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, పురపాలక పాఠశాలల్లో మొత్తం 13,192 పోస్టులు.. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 881 పోస్టులు.. జువెనైల్‌ పాఠశాలల్లో 15 పోస్టులు, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసే బధిరులు, అంధుల పాఠశాలల్లో 31 పోస్టులున్నాయి.

Exit mobile version