BSEB Results 2024 : ఇంటర్ ఫైనల్ పరీక్ష ఫలితాలు.. 87.21శాతం ఉత్తీర్ణత.. బాలికలదే పైచేయి!

BSEB Results 2024 : బీఎస్ఈబీ ఇంటర్ ఫైనల్ పరీక్షలో అబ్బాయిల కన్నా బాలికలు మరోసారి సత్తా చాటారు. బాలికల ఉత్తీర్ణత శాతం 88.11శాతం కాగా, బాలురు 85.69శాతం ఉత్తీర్ణత సాధించారు.

BSEB Results 2024 : బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (BSEB) ఇంటర్మీడియట్ (12వ తరగతి) పరీక్షల ఫలితాలను ప్రకటించింది. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ (biharboardonline.bihar.gov.in)ని విజిట్ చేయడం ద్వారా తమ స్కోర్‌లను చెక్ చేసుకోవచ్చు.

Read Also : CBSE Board Exams : టెన్త్, ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు..!

ఇంటర్ ఫలితాలను యాక్సెస్ చేయడానికి విద్యార్థులు తమ రోల్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బీఎస్ఈబీ చైర్మన్ ఆనంద్ కిషోర్ ప్రకారం.. సివాన్‌కు చెందిన మృత్యుంజయ్ కుమార్ 96.20శాతం సైన్స్ స్ట్రీమ్‌లో టాప్ ర్యాంకులో నిలవగా, పాట్నాకు చెందిన తుషార్ కుమార్ 96.40శాతం ఆర్ట్స్ స్ట్రీమ్‌లో టాప్ ర్యాంకులో నిలిచాడు. బాలికల్లో షేక్‌పురాకు చెందిన ప్రియా కుమారి 95.60శాతం కామర్స్ స్ట్రీమ్‌లో మొదటి ర్యాంక్ సాధించింది.

మరోసారి సత్తా చాటిన బాలికలు.. 88.11శాతం ఉత్తీర్ణత :
ఇంటర్ ఫైనల్ పరీక్షలో మరోసారి బాలురుల కన్నా మెరుగైన ప్రతిభ కనబరిచారు. బాలికల ఉత్తీర్ణత శాతం 88.11శాతం కాగా, బాలురులు 85.69శాతంగా ఉన్నారు. మొత్తం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 87.21శాతంగా నమోదైంది. 12వ తరగతి పరీక్షలు గత ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 12 మధ్య నిర్వహించారు. గత ఏడాదిలో ఇంటర్ ఫలితాలు మార్చి 21న ప్రకటించారు.

బీహార్ 12వ ఫలితంతో సంతృప్తి చెందని విద్యార్థులు మార్చి 28 నుంచి స్క్రూటినీ, వెరిఫికేషన్ లేదా రీ-కౌంటింగ్ కోసం అభ్యర్థించవచ్చు. ఈ ఏడాదిలో ఇంటర్మీడియట్ పరీక్షలో 13,04,352 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 6,26,431 మంది విద్యార్థినులు, 6,77,921 మంది విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,523 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి.

బీఎస్ఈబీ క్లాస్ 12 ఫలితాలు : రిజల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకోండిలా :

  • అధికారిక బీఎస్ఈబీ వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
  • హోమ్‌పేజీలో రిజల్ట్స్ సెక్షన్ నావిగేట్ చేయండి.
  • బీఎస్ఈబీ క్లాస్ 12 రిజల్ట్స్ 2024 లింక్‌ని ఎంచుకోండి.
  • మీ లాగిన్ వివరాలను ఎంటర్ చేయండి.
  • బీహార్ బోర్డ్ క్లాస్ 12 రిజల్ట్స్ డేటా చూడవచ్చు.
  • ఈ ఫలితాలను డౌన్‌లోడ్ చేయండి.
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఒక కాపీని ప్రింట్ తీసి పెట్టుకోండి.

Read Also : CBSE Open Book Exams : పుస్తకాలు చూస్తూనే పరీక్షలు రాయొచ్చుంటున్న సీబీఎస్ఈ.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన!

ట్రెండింగ్ వార్తలు