BSF Constable Tradesman Recruitment Notification Released
నిరుద్యోగులకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గుడ్ న్యూస్ చెప్పింది. కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 26వ తేదీ నుంచి అధికారిక వెబ్ సైట్ bsf.gov.in నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఆగస్టు 25 వరకు కొనసాగనుంది. ఇక ఈ కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ రిక్రూట్‌మెంట్ లో భాగంగా మొత్తం 3588 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వాటిలో పురుషులకు 3406 పోస్టులు కేటాయించగా.. 182 ఖాళీలను మహిళా అభ్యర్థుల కోసం కేటాయించారు. ఇక గ్రేడుల వారి పూర్తి వివరాల కోసం అధికారిక వబ సైట్ ను bsf.gov.in సంప్రదించవచ్చు.
వయోపరిమితి:
ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో 5 ఏళ్లు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది.