BSF Jobs: బీఎస్ఎఫ్‌లో ఉద్యోగాలు.. బిగ్ అలర్ట్.. రెండు రోజులే సమయం..

అభ్యర్థులు అప్లయ్ చేసుకోవడానికి ముందుగా కొన్ని కీలక డాక్యుమెంట్లు దగ్గర ఉంచుకోవాలి.

BSF Jobs: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)లో హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్) పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవడానికి సమయం దగ్గర పడుతోంది. దరఖాస్తు చేసుకోవడానికి ఇక రెండు రోజులే సమయం ఉంది. అప్లికేషన్ సమర్పించడానికి సెప్టెంబర్ 23 ఆఖరు తేదీ.

టెన్త్, ఐటీఐ లేదా ఇంటర్ ‌(ఎంపీసీ) పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. రాతపరీక్ష, PST, PET, మెడికల్ టెస్ట్, డిక్టేషన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలెక్షన్ చేస్తారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్ లైన్ లోనే అప్లయ్ చేసుకోవాలి. ఆగస్ట్ 24వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

మొత్తం పోస్టులు 1121. వీటిలో రేడియో ఆపరేటర్ పోస్టులు 911. రేడియో మెకానిక్ పోస్టులు 211. గ్రూప్ సి కింద భర్తీ చేస్తున్నారు. బీఎస్ఎఫ్ రిక్రూట్ మెంట్ పోర్టల్ rectt.bsf.gov.in. ద్వారా అప్లయ్ చేసుకోవాలి.

అభ్యర్థులు అప్లయ్ చేసుకోవడానికి ముందుగా కొన్ని కీలక డాక్యుమెంట్లు దగ్గర ఉంచుకోవాలి. ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, ఐడెంటిటీ ప్రూఫ్, స్కాన్డ్ ఫొటోగ్రాఫ్, సిగ్నేచర్ రెడీగా ఉంచుకోవాలి. అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పేరు, పుట్టిన తేదీ, అర్హతలు వంటి వారి వ్యక్తిగత వివరాలు అధికారిక రికార్డులతో సరిపోయేలా చూసుకోవాలి.

ఇలా అప్లయ్ చేసుకోండి..

* అధికారిక BSF నియామక పోర్టల్‌ను సందర్శించండి (rectt.bsf.gov.in.)
* రిక్రూట్‌మెంట్ విభాగంపై క్లిక్ చేయాలి. హెడ్ కానిస్టేబుల్ RO/RM అప్లయ్ ఆన్‌లైన్‌ని ఎంచుకోవాలి.
* పేరు, పుట్టిన తేదీ, వ్యాలిడ్ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను నమోదు చేయడం ద్వారా వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) పూర్తి చేయండి.
* క్రెడెన్షియల్స్ లో లాగిన్ అవ్వండి. విద్యా అర్హతలు, కేటగిరీ వివరాలు, ఇతర అవసరమైన సమాచారంతో దరఖాస్తు ఫారమ్‌ను ఫిలప్ చేయాలి.
* లేటెస్ట్ పాస్‌పోర్ట్-సైజు ఫోటోలు, సంతకం, ఇతర అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను సూచించిన ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయండి.
* ఫీజు చెల్లించాలి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి.
* సబ్మిట్ కొట్టే ముందు మరొకసారి వివరాలన్నీ చెక్ చేసుకోవాలి.
* చివరగా సబ్మిట్ కొట్టాలి. తదుపరి అవసరాల కోసం ఒక కాపీని డౌన్ లోడ్ చేసుకోవడం మేలు.

అభ్యర్థులకు ముఖ్య గమనిక. కరెక్ట్ డీటైల్స్ మాత్రమే ఇవ్వాలి. లేదంటే తర్వాతి దశలలో తిరస్కరణకు దారితీయొచ్చు. BSF నుండి అప్ డేట్స్ పొందాలంటే అభ్యర్థులు తమ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలి.

ఫీజు
జనరల్/ఓబీసీ/ఈడబ్లుఎస్ – 100 రూపాయలు
ఎస్సీ, ఎస్టీ, పీడబ్లుడీ – ఫీజు లేదు

Also Read: 7వేల పోస్టులు.. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హత, జీతం, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు..