ఈ మధ్య కాలంలో చాలా మంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చదువుకు తగ్గ ట్రైనింగ్, మంచి స్టైఫండ్స్ కూడా వస్తుండటంతో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అలాంటి మంచి అవకాశాన్ని ప్రముఖ కంపెనీ క్యాప్‌జెమిని అందిస్తోంది. తాజాగా క్యాప్‌జెమిని తమ కంపెనీలో ఇంటర్న్షిప్ ఆఫర్ పరకటించింది. ఏటా రెండు సార్లు క్యాప్‌జెమిని ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం ను కండక్ట్ చేస్తుంది . 3 నుంచి 6 నెలల పాటు ఈ ఇంటర్న్షిప్ జరుగుతుంది. ఈ ఆరు నెలల్లో విద్యార్థులకు వివిధ డొమైన్లకు సంబంధించిన స్కిల్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లాంటి విభాగాల్లో ట్రైనింగ్ అందిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
విద్యార్హత: బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, బీసీఏ తదితర కోర్సుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు ఈ ఇంటర్న్షిప్ కి అప్లై చేసుకోవచ్చు.
స్టైఫండ్ వివరాలు: ఈ ఇంటర్న్షిప్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు స్టైఫండ్ అందిస్తారు. అంతేకాదు, ఈ పీరియడ్ లో ఇండస్ట్రీ నిపుణులతో కలిసి పనిచేసే అవకాశం దక్కుతుంది. దానివల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్, చాలా విషయాల్లో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ పూర్తి చేసిన వారికి సంస్థ నుండి సర్టిఫికేషన్ కూడా ఉంటుంది.
దరఖాస్తు ఇలా చేసుకోండి:
- అభ్యర్థులు ముందుగా క్యాప్‌జెమిని అధికారిక పోర్టల్ https://www.Capgemini.com లోకి వెళ్ళాలి
- తరువాత కెరీర్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
- అందులో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ లింక్‌పై క్లిక్ చేయాలి
- అక్కడ అప్లై ఆన్లైన్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- అభ్యర్థులు వారి వివరాలతో అప్లికేషన్ ఫారం ఫిల్ చేయాలి
- అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసు సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
ఎంపిక ప్రక్రియ: ముందుగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల రెజ్యుమెలను షార్ట్ లిస్ట్ చేస్తారు. వారికి ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. పాస్ అయిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ క్లియర్ చేసిన వారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తరువాత ఇంటర్న్‌షిప్‌లో జాయిన్ చేసుకుంటారు.