కరోనా ఎఫెక్ట్: జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు వాయిదా

  • Publish Date - March 19, 2020 / 09:57 AM IST

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా జరగాల్సిన జేఈఈ,సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ వైరస్‌ వేగంగా వ్యాపిస్తుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే CBSE, ICSE, ISC పరీక్షలు కూడా  వాయిదా పడిన విషయం తెలిసిందే. అసలు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్‌ 5 నుంచి 11వ తేదీ వరకు జరగాల్సిన పరీక్షలు మార్చి 31 తర్వాత జరగనున్నాయి. (ఒంగోలు రిమ్స్ నుంచి కరోనా పాటిజివ్ వ్యక్తి పరార్)

ఈ పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను కేంద్రం మార్చి 31 తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది. విద్యార్ధులకు ఏమైనా అనుమానాలు ఉంటే హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా సమాచారం కనుక్కోవచ్చని తెలిపింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్నీ విద్యా సంస్థలు మూతపడ్డాయి.

మరోవైపు కరోనా బాధితుల సంఖ్య 166కు పెరిగింది. వారందరిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక దేశంలో నిర్వహించాల్సిన సీబీఎస్ఈ, నాన్ సీబీఎస్‌సీ యూజీసీ, సహా అన్ని పరీక్షలు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం అన్నిరాష్ట్రాలను ఆదేశించింది.