cbse12th result
CBSE: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఇవాళ 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. cbseresults.nic.in, cbse.gov.in లో విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 87.33 గా నమోదైందని సీబీఎస్ఈ తెలిపింది.
కొవిడ్ తర్వాత నమోదైన అత్యధిక ఉత్తీర్ణత శాతం ఇదేనని చెప్పింది. 2019లో సీబీఎస్ఈ 12వ తరగతి ఉత్తీర్ణత 83.40 శాతంగా నమోదైంది. అనారోగ్య పోటీకి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రథమ, ద్వితీయ, తృతీయ డివిజన్ గా విద్యార్థుల ఫలితాలను విభజించలేదని సీబీఎస్ఈ పేర్కొంది.
ప్రాంతాల వారీగా చూస్తే తిరువనంతపురంలో అత్యధికంగా 99.91 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రయోగ్‌రాజ్ (78.05 శాతం)లో అత్యల్ప ఉత్తీర్ణత శాతం నమోదైంది. cbseresults.nic.in లేదా cbse.gov.in ను విద్యార్థులు ఓపెన్ చేసి, రోల్ నంబరు, అడ్మిట్ కార్డు ఐడీ, స్కూల్ నంబరును నమోదు చేసి ఫలితాలు పొందవచ్చు. DigiLockerలోనూ CBSE Board 2023 ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.
#CbseResult2023 #DigiLocker pic.twitter.com/eAzS9cMuyv
— CBSE HQ (@cbseindia29) May 12, 2023