CBSE Reschedules CTET Exam, Check New Date Here
CBSE CTET Exam Date : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సీటెట్ డిసెంబర్, 2024 పరీక్షల షెడ్యూల్‌ను మళ్లీ సవరించింది. అధికారిక విడుదల ప్రకారం.. ఇప్పుడు పరీక్ష డిసెంబర్ 14న నిర్వహించనున్నారు. సీటెట్ ఇటీవల డిసెంబర్ 15న షెడ్యూల్ అయింది. అయితే, వాస్తవానికి సీటెట్ పరీక్ష తేదీ డిసెంబరు 1, 2024కి సెట్ చేశారు. కానీ, డిసెంబర్ 15, 2024న ఇతర పరీక్షల కారణంగా పరీక్ష తేదీని డిసెంబర్ 14కి సవరించారు.
సీటెట్ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. వివిధ అభ్యర్థుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. కొన్ని పోటీ పరీక్షలు కొన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో 15 డిసెంబర్ 2024 (ఆదివారం) జరగనున్నాయి. అభ్యర్థుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని సీటెట్ పరీక్షను 14 డిసెంబర్ 2024న (శనివారం) నిర్వహించాలని నిర్ణయించారు.
Read Also : iPhone 15 Pro Discount : ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై బిగ్ డిస్కౌంట్.. ఇదే బెస్ట్ టైమ్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?
ఏదైనా నగరంలో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే.. పరీక్షను 15 డిసెంబర్ 2024 (ఆదివారం) కూడా నిర్వహించవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 16, 2024. ఫారమ్‌లను చివరి తేదీ రాత్రి 11:59 గంటలలోపు సమర్పించాలి. ఫీజును సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 16, 2024 వరకు సమయం ఉంటుంది.
పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకోవాలంటే? :
జనరల్/ఓబీసీ(ఎన్‌సీఎల్) కేటగిరీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ. 1,000, రెండు పేపర్‌లకు 1,200 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/విభిన్న వికలాంగుల నుంచి దరఖాస్తుదారులు ఒక పేపర్‌కు రూ. 500, రెండు పేపర్‌లకు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది. సీటెట్‌లో అన్ని ప్రశ్నలూ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (MCQ) ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉండదు.
సీటెట్‌లో రెండు పేపర్లు :
(i) పేపర్ Iలో 1వ తరగతి నుంచి 5 తరగతులకు ఉపాధ్యాయుడిగా ఉండే అభ్యర్థులకు
(ii) పేపర్ 2లో 6వ తరగతి నుంచి 8 తరగతులకు ఉపాధ్యాయుడిగా ఉండాలనుకునే అభ్యర్థులకు..
Read Also : WhatsApp New Chat : వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ వస్తోంది.. మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు..!