సెంట్రల్ కోల్ ఫీల్ట్స్ లిమిటెడ్ (CCL) ఐటీఐ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 750 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాల వారిగా ఖాళీలు:
ఫిట్టర్ – 250, వెల్డర్- 40, ఎలక్ట్రీషియన్ – 360, మెకానిక్ – 45, కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ – 15, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ – 5, మెకానిస్ట్ – 20, టర్నర్ – 15.
ఎంపికా విధానం:
అభ్యర్ధులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష తెదీ తెలియాల్సి ఉంది.
వయసు:
అభ్యర్ధులు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. SC,ST వారికి 5 సంవత్సరాలు. OBC వారికి 3 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 16, 2019.
దరఖాస్తు చివరితేది: అక్టోబర్ 15, 2019.