‘NEET’ పీజీ కటాఫ్ మార్కులు తగ్గింపు

మెడికల్, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘నీట్’ కటాఫ్ మార్కులను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఫలితాలు విడుదల చేసినప్పుడు కటాఫ్ మార్కులలో 50 శాతంగా ఉన్న కటాఫ్ పర్సంటేజీలో 6 శాతం తగ్గించింది. ఫలితంగా జనరల్ కేటగిరీ అభ్యర్థులు 44 శాతం, దివ్యాంగులు 39 శాతం, SC, ST, OBC అభ్యర్థులు 34 శాతం మార్కులు సాధిస్తే మెడికల్, పీజీ కోర్సుల్లో MD, MS, DNB అర్హత సాధించవచ్చు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ‘NEET-PG’ కటాఫ్ మార్కులను 6 పర్సెంటైల్ తగ్గిస్తున్నట్టు నిర్ణయం తీసుకోవడంతో పీజీ వైద్య విద్య కోర్సులో చేరేందుకు మరికొంతమందికి అవకాశం లభించింది. కన్వీనర్ కోటా కింద భర్తీ చేసే ఈ పీజీ సీట్లకు మే 12 వరకు దరఖాస్తులు స్వీకరించి, మే 13న ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు.