Jobs in Telangana medical field
తెలంగాణ ప్రభత్వం ఇటీవల వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీ కోసం పలు నోటిఫికేషన్లు విడుదల చేసింది. అందులో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి ఇటీవలే ప్రకటన విడుదలైంది. అయితే, ఈ నోటిఫికేషన్ లో పలు మార్పులు జరిగాయి. మేరకు అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ముందుగా వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం జూలై 10 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాలి. కానీ, ఇప్పుడు జూలై 20వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://mhsrb.telangana.gov.in/ ద్వారా పూర్తి చేసుకోవాలని సూచించారు.
వయోపరిమితి: దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 46 ఏళ్ల లోపు ఉండాలి.
విద్యార్హత: దరఖాస్తుదారులు సంబంధిత విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి.
జూలై 20 నుంచి 27 వరకు ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ.
జూలై 28 నుంచి 29వ తేదీ వరకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్
వేతనం వివరాలు: ఎంపికైన అభ్యర్థులకు నెల జీతం రూ.68,900 నుంచి రూ.2,05,500 వరకు వస్తుంది.
దరఖాస్తు రుసుము: అందరు అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ప్రాసెసింగ్ ఫీజు మరో రూ.200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు ఉండదు.