CM KCR inaugurated 8 Medical Colleges : ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

తెలంగాణలో పెద్ద సంఖ్యలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం కృష్టికి ఫలితంగా సీఎం కేసీఆర్ ఈరోజు ఎనిమిది కాలేజీలను ప్రారంభించారు.ప్రగతి భవన్ నుంచి వర్చువల్ గా తెలంగాణలో కొత్తగా నిర్మించిన 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ఈరోజు ప్రారంభించారు.

CM KCR inaugurated 8 medical colleges : తెలంగాణలో పెద్ద సంఖ్యలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం కృష్టికి ఫలితంగా సీఎం కేసీఆర్ ఈరోజు ఎనిమిది కాలేజీలను ప్రారంభించారు.ప్రగతి భవన్ నుంచి వర్చువల్ గా
తెలంగాణలో కొత్తగా నిర్మించిన 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ఈరోజు (నవంబరు 15,2022) ప్రారంభించారు. జగిత్యాల, రామగుండం, కొత్తగూడెం, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, మంచిర్యాల, వనపర్తి, మహబూబాబాద్ లో మెడికల్ కాలేజీలను నిర్మించిన సంగతి తెలిసిందే. వీటిని సీఎం కేసీఆర్ వర్చువల్ గా ప్రారంభించారు.

సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో ఒకేసారి ఈ మెడికల్ కాలేజీల్లో తరగతులను ప్రారంభించారు. ఈ ప్రారంభం తరువాత ఆయా మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యాబోధనను లాంఛనంగా ప్రారంభమయ్యాయి. రూ.4,080 కోట్ల వ్యయంతో ఈ మెడికల్ కాలేజీలను నిర్మించారు. వీటికి ఆయా జిల్లాల ఆసుపత్రులను అనుసంధానం చేశారు. నూతన మెడికల్ కాలేజీల ప్రారంభం నేపథ్యంలో 1,200 మెడికల్ సీట్లను కేటాయించారు. వీటితోపాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 85 శాతం బీ కేటగిరీ మెడికల్ సీట్లను సైతం విద్యార్థులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అదనంగా 1,068 సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి.

2014లో తెలంగాణలో మొత్తం 850 ఎంబీబీఎస్‌ మెడికల్ సీట్లు ఉండగా, 2022 నాటికి సీట్ల సంఖ్య 2,901కి పెరిగింది. 2014లో 613 పీజీ సీట్లు ఉండగా 2022 నాటికి మొత్తం పీజీ గవర్నమెంట్‌ మెడికల్ సీట్ల సంఖ్య 1,249కి చేరింది. దీంతో రాష్ట్ర మెడికల్‌ విద్యార్ధులకు మరింత ప్రయోజనం చేకూరనుంది.

 

ట్రెండింగ్ వార్తలు