Coal India Trainee Posts
Coal India Trainee Posts : సిఐఎల్ (CIL) రిక్రూట్‌మెంట్ 2024 : కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రకటించింది. అక్టోబర్ 29, 2024న అప్లికేషన్‌లు ఓపెన్ అయ్యాయి. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక సిఐఎల్ వెబ్‌సైట్ ద్వారా నవంబర్ 28, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో మొత్తం 640 ఖాళీలు ఉన్నాయి.
ఖాళీ వివరాలివే :
దరఖాస్తు ప్రక్రియ, ఫీజు విధానం :
జనరల్, ఓబీసీ కేటగిరీల అభ్యర్థులు రూ. 1,180 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అయితే, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు.. శారీరక వైకల్యం ఉన్నవారికి ఈ రుసుము నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తుదారులకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్ల వరకు ఉంటుంది.
అర్హత ప్రమాణాలివే :
మేనేజ్‌మెంట్ ట్రైనీ స్థానాలకు అర్హత పొందాలంటే అభ్యర్థులు ఈ కింది ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. వారి బీటెక్/బీఈ చివరి సంవత్సరంలో పూర్తి చేసి ఉండాలి లేదా హాజరవుతూ ఉండాలి. గేట్ 2025 స్కోర్‌ను కలిగి ఉండాలి. ఎంపిక ప్రక్రియ మెరిట్ ఆధారితంగా ఉంటుంది. అభ్యర్థుల గేట్ పరీక్ష స్కోర్‌లపై ఆధారపడి ఉంటుంది. ఆపై ఇంటర్వ్యూ లేదా రాతపరీక్ష ఉంటుంది.
గేట్ 2025 :
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) అనేది వివిధ అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ సబ్జెక్టులపై అభ్యర్థుల అవగాహనను అంచనా వేయడానికి రూపొందించిన జాతీయ స్థాయి పరీక్ష. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ ద్వారా ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో గేట్ 2025 నిర్వహించనుంది. ఈ పరీక్షా ఫలితాలు మార్చి 19, 2025న ప్రకటించనుంది.
భారత్ కాకుండా ఇతర దేశాల నుంచి తమ అర్హత డిగ్రీని పొందినవారు/అభ్యసిస్తున్నవారు : అభ్యర్థులు ప్రస్తుతం 3వ లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలలో ఉండాలి లేదా ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/సైన్స్/లో వారి బ్యాచిలర్ డిగ్రీని (కనీసం మూడేళ్ల వ్యవధి) పూర్తి చేసి ఉండాలి. కామర్స్/ ఆర్ట్స్/ హ్యుమానిటీస్.
గేట్ 2025 పేపర్ విధానం :
గేట్ 2025 పరీక్ష పేపర్‌లలో 3 రకాల ప్రశ్నలు ఉంటాయి. మల్టీ-ఆప్షనల్ ప్రశ్నలు (ఎంసీక్యూలు), మల్టీ-ఆప్షనల్ ప్రశ్నలు (ఎంఎస్‌క్యూ) న్యూమరికల్ ఆన్సర్ టైప్ (NAT).
మార్కింగ్ స్కీమ్ :
మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (MCQ) అన్ని పేపర్లు, సెక్షన్లలో ఒక్కొక్కటి 1 లేదా 2 మార్కులను కలిగి ఉంటాయి. ఈ ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌గా ఉంటాయి. ఒక్కొక్కదానికి 4 సమాధానాల ఎంపిక ఉంటుంది. వాటిలో ఒకటి మాత్రమే సరైనది.
తప్పు సమాధానాలకు నెగటివ్ మార్కులు : ఎంసీక్యూలో తప్పుగా ఎంచుకున్న సమాధానానికి నెగటివ్ మార్కులు ఉంటాయి. 1-మార్క్ ఎంసీక్యూలకు, తప్పు సమాధానానికి 1/3 మార్కు తొలగిస్తారు. అదేవిధంగా, 2-మార్క్ ఎంసీక్యూలకు తప్పు సమాధానానికి 2/3 మార్కు తొలగిస్తారు.