Coal India : కోల్ ఇండియా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

అర్హతల విషయానికి వస్తే సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ ఉద్యోగానికి సంబంధిత స్పెషలైజేషన్ లో ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ, డీఎన్ బీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 42 సంవత్సరాలు మించరాదు. సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి సంబంధిత స్పెషలైజేషన్ లో బీడీఎస్, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.

Coal India Western Coal Fields Limited Job Vacancies

Coal India : కోల్ ఇండియాకు చెందిన నాగ్ పూర్ లోని కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 108 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్, మెడికల్ స్పెషలిస్ట్ 39 ఖాళీలు, సీనియర్ మెడికల్ ఆఫీసర్ 69 ఖాళీలు ఉన్నాయి. అనెస్తీషియా, సైకియాట్రీ, డెర్మటాలజిస్ట్, ఈఎన్ టీ, రేడియాలజీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

అర్హతల విషయానికి వస్తే సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ ఉద్యోగానికి సంబంధిత స్పెషలైజేషన్ లో ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ, డీఎన్ బీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 42 సంవత్సరాలు మించరాదు. సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి సంబంధిత స్పెషలైజేషన్ లో బీడీఎస్, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 35 ఏళ్లకు మించరాదు. ఇంటర్వ్యూ లో మెరిట్ అధారంగా ఎంపిక చేస్తారు.

అభ్యర్ధులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా డిప్యూటీ జనరల్ మేనేజర్, హెచ్ ఓడీ (ఈఈ) ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లిష్ మెంట్ డిపార్ట్ మెంట్, సెకండ్ ఫ్లోర్, కోల్ ఎస్టేట్, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, సివిల్ లైన్స్, నాగ్ పూర్, మహారాష్ట్ర 440001 చిరునామాకు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చివరి తేది 29 అక్టోబర్ 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.coalindia.in/ పరిశీలించగలరు.