Common Recruitment for AIIMS
Common Recruitment for AIIMS 2023 : ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ ఢిల్లీతోపాటుగా, దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో నాన్ ఫ్యాకల్టీ గ్రూవ్ బి, సి పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,036 నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బి, సి పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్దుల నుండి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నారు.
READ ALSO : Uday Bhaskar : బీఆర్ఎస్ లో చేరిన బాబు మోహన్ తనయుడు
ఎయిమ్స్ సంస్థలు:
ఎయిమ్స్ భటిండా, ఎయిమ్స్ భోపాల్స్ ఎయిమ్స్ భువనేశ్వర్, ఎయిమ్స్ బీబీనగర్, ఎయిమ్స్ బిలాన్‌పూర్, ఎయిమ్స్ దేవ్‌ఘర్, ఎయిమ్స్ గోరఖ్‌పూర్, ఎయిమ్స్ జోధ్‌పుర్, ఎయిమ్స్ కల్యాణి, ఎయిమ్స్ మంగళగిరి, ఎయిమ్స్ నాగ్‌పుర్, ఎయిమ్స్ రాయ్ బరేలీ, ఎయిమ్స్ న్యూదిల్లీ ఎయిమ్స్ పట్నా ఎయిమ్స్ రాయ్‌పూర్, ఎయిమ్స్ రాజ్‌కోట్, ఎయిమ్స్ రిషికేశ్ ఎయిమ్స్ విజయ్‌పూర్‌లలో ఈ ఖాళీలు భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు ;
అసిస్టెంట్ అడ్మినిస్టేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ డైటీషియన్, అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ లాండ్రీ సూపర్‌వైజర్, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్, ఆడియోలజిన్ట్ అండ్ న్సీచ్ థెరపిస్ట్ బయో మెడికల్ ఇంజినీర్, క్యాషియర్, కోడింగ్ క్లర్క్ డార్క్ రూమ్ అసిస్టెంట్, హాన్సిటల్ అటెండెంట్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్స్ జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డెంటల్ హెజీనిస్ట్ డైటీషియన్, డ్రైవర్, ఎలక్ట్రీషియన్, ఫైర్ టెక్నీషియన్, గ్యాన్/ పంప్ మెకానిక్, హెల్త్ ఎడ్యుకేటర్, హిందీ ఆఫీసర్, జూనియర్ ఫిజియోథెరపిన్ట్ జూనియర్ రిసెష్టన్ ఆఫీసర్, జూనియర్ వార్డెన్, ల్యాబ్ టెక్నీషియన్, లాండ్రీ మేనేజర్, లాండ్రీ సూపర్‌వైజర్, లీగల్ అసిస్టెంట్ తదితర ఖాళీలు ఉన్నాయి.
READ ALSO : Vinod Thomas : కారులో శవమై కనిపించిన నటుడు
అర్హత:
పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, పదో తరగతి, ఐటీఐ, 12వ తరగతి,ఇంటర్, సంబంధిత విభాగంలో డిప్లామా, డిగ్రీ పీజీ, పీజీ డిప్తామా, పీహెచ్‌డీ, టైపింగ్/ డ్రైవింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.8000; ఎస్సీ,ఎస్టీ ఈడబ్ల్యూఎన్ అభ్యర్థులకురూ.2400 ఫీజుగా నిర్ణయించారు. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
READ ALSO : NTR Coins : రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ స్మారక నాణేల విక్రయం
ఎంపిక ప్రక్రియ:
సీబీటీ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.12.2023 గా నిర్ణయించారు. దరఖాస్తు సవరణ 06.12.2023 నుంచి 07.12.2023 తేదీ వరకు అనుమతిచ్చారు. అడ్మిట్ కార్డులను 12-12-2023 జారీ చేస్తారు. పరీక్ష తేదీలు: 18 నుంచి 20-12-2023 వరకు.
READ ALSO : Recruitment of Constables : పదోతరగతి విద్యార్హతతో కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు
పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://aiimsexams.ac.in/info/Recruitments_new.html పరిశీలించగలరు.