Uget 2022
Cuet UG 2022 : సెంట్రల్ యూనివర్శిటీస్ ఎంట్రన్స్ టెస్ట్(సీయూఈటీ యూజీ) -2022 నోటిఫికేషన్ జారీ అయింది. దేశ వ్యాప్తంగా 45కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 2022 – 2023 విద్యాసంవత్సరానికి యూజీ కోర్సుల్లో దీని ద్వారా ప్రవేశం పొందవచ్చు. పరీక్ష నిర్వాహణ బాధ్యతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అప్పగించారు. పరీక్షను జులై మొదటి వారం లేదా రెండో వారంలో నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే యూజీ కి సంబంధించి ఇంటర్వీడియట్, తత్సమాన పరీక్ష అర్హత కలిగి 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. పీజీ కి సంబంధించి ఏదైనా డిగ్రీ, సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
యూజీ పరీక్ష రెండు విడతలుగా నిర్వహించనున్నారు. తొలి స్లాట్ లో 195 నిమిషాలు, రెండో స్లాట్ లో 225 నిమిషాలు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 5మార్కులు, తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. ఎంచుకున్న సబ్జెక్టుల ప్రకారం పరీక్ష
వ్యవధి మారుతుంది. ప్లస్ టూ, ఎన్సీఈఆర్ టీ పుస్తకాల నుండే సిలబ్ ఉంటుంది. పరీక్ష ఫీజుకు సంబంధించి జనరల్ అభ్యర్ధులకు 650 రూ. ఓబీసీ 600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 550 రూ పరీక్ష పీజుగా నిర్ణయించారు.
ప్రైవేటు, డీమ్డ్ టుబీ యూనివర్సిటీలు అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోరును ఆధారంగా చేసుకోవచ్చని యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ తెలిపింది. ఈ పరీక్ష రాయటం ద్వారా జవహర్ లాల్ నెహ్రు యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్, ఇగ్నో, అలీగర్
ముస్లిం యూనివర్శిటీ, ఢిల్లీ యూనివర్శిటీ, బెనారస్ హిందూ యూనివర్శిటీ వంటి మరెన్నో ప్రముఖ విద్యాసంస్ధల్లో సీటు పొందేందుకు అవకాశం లభిస్తుంది.
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు పంపేందుకు ఆఖరు తేదిగా 06 మే , 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://cuet.samarth.ac.in/, www.nta.ac.in సంప్రదించగలరు.