CUET PG Answer Key : 2024 సీయూఈటీ పీజీ ఫైనల్ ఆన్సర్ కీ త్వరలో విడుదల.. పూర్తివివరాలు ఇవే!

CUET PG Answer Key : సీయూఈటీ పీజీ ఆన్సర్ కీ విడుదలైన తర్వాత అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ. 200 చొప్పున చెల్లించి ప్రశ్నలపై అభ్యంతరాలను తెలియజేయొచ్చు.

CUET PG Answer Key Expected To Be Out Soon

CUET PG Answer Key : కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET PG) 2024 ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ త్వరలో విడుదల కానున్నాయి. విడుదలైన తర్వాత అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (pgcuet.samarth.ac.in)లో యాక్సెస్ చేయొచ్చు. సీయూఈటీ పీజీ 2024 మార్చి 11 నుంచి మార్చి 28 వరకు ఆన్‌లైన్ మోడ్‌లో 9 విదేశీ నగరాలతో సహా 262 నగరాల్లోని 572 పరీక్షా కేంద్రాలలో జరిగింది. ఈ పరీక్షకు దాదాపు 4,60వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Read Also : CBSE Open Book Exams : పుస్తకాలు చూస్తూనే పరీక్షలు రాయొచ్చుంటున్న సీబీఎస్ఈ.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన!

ఆన్సర్ కీ విడుదలైన తర్వాత అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ. 200 చొప్పున చెల్లించి ప్రశ్నలపై అభ్యంతరాలను తెలపవచ్చు. గడువులోపు అభ్యంతరాలు సమర్పిస్తేనే వాటిని స్వీకరిస్తారు. తుది ఫలితాలు వెలువడిన తర్వాత యూనివర్శిటీలు మెరిట్ జాబితాను వెల్లడిస్తాయి. ఎన్టీఏ అందించిన సీయూఈటీ (పీజీ) స్కోర్‌కార్డ్ 2024ని యూనివర్శిటీలు వ్యక్తిగత కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం ఉపయోగిస్తాయి.

సీయూఈటీ పీజీ 2024 జవాబు కీ : డౌన్‌లోడ్ చేయండిలా :

  • NTA CUET PG అధికారిక వెబ్‌సైట్‌ (pgcuet.samarth.ac.in)కి వెళ్లండి
  • హోమ్‌పేజీలో ‘CUET PG Final Answer Key 2024’ అనే లింక్‌ని ఎంచుకోండి
  • మీ స్క్రీన్‌పై ఫైనల్ ఆన్సర్ కీ కొత్త (PDF) కనిపిస్తుంది.
  • ఆన్సర్ కీని రివ్యూ చేయండి.
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేయండి.

ఎన్టీఏ ప్రకారం.. 190 యూనివర్శిటీలు ప్రవేశ ప్రక్రియ కోసం సీయూఈటీ పీజీ స్కోర్‌లను ఉపయోగిస్తాయి. ఇందులో 105 ప్రైవేట్, డీమ్డ్ యూనివర్శిటీలు, 9 ప్రభుత్వ సంస్థలు, 38 కేంద్ర, ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.

సీయూఈటీ పీజీ 2024 రిజర్వేషన్ విధానాలు :

  • ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు ప్రతి ప్రోగ్రామ్‌లో దాదాపు 15శాతం సీట్లు రిజర్వ్
  • ప్రతి కోర్సులో దాదాపు 7.5శాతం సీట్లు ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు కేటాయింపు
  • దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రతి ప్రోగ్రామ్‌లో దాదాపు 5శాతం సీట్లు రిజర్వ్

Read Also : CBSE Boards Exam 2024 : పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడానికి విద్యార్థులకు సీబీఎస్ఈ సూచనలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?

ట్రెండింగ్ వార్తలు