IIT GUWAHATI : ఐఐటి గౌహతిలో డేటా సైన్స్, AI, వెబ్ డెవలప్‌మెంట్ సర్టిఫికేషన్ కోర్సులు

అధికారిక ప్రకటన ప్రకారం, IIT గౌహతిలోని E&ICT అకాడమీ ద్వారా ఈ కోర్సులకు సంబంధించి మెటీరియల్ రూపొందించారు. అల్మాబెటర్ లో నమోదు చేసుకున్న వారు IIT గౌహతిలోని E&ICT అకాడమీ నుండి కోర్సు పూర్తి చేసుకున్న తరువాత ధృవీకరణ పత్రాలను అందుకుంటారు.

IIT GUWAHATI

IIT GUWAHATI : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గౌహతికి చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (E&ICT) అకాడమీ ఆద్వర్యంలో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , వెబ్ డెవలప్‌మెంట్‌లో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లను అల్మాబెటర్‌ సంయుక్త ఆధ్వర్యంలో అందించనుంది. ఈ కోర్సుల ద్వారా పూర్తిస్ధాయి స్టాక్ డేటా సైన్స్, AI , పూర్తి స్ధాయిలో స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్‌లో అవగాహన కల్పించటంతోపాటు, కోర్సు పూర్తి చేసిన వారికి ధృవపత్రాలను అందజేస్తారు. కెరీర్ అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉంటుంది.

READ ALSO : Backache : నడుము నొప్పి రావడానికి కారణాలు ఇవి కూడా..

ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY), IITలు , NITల సహకారంతో E&ICT అకాడెమీలు ఈ కోర్సులను నిర్వహించనున్నాయి. IIT గౌహతి, అల్మాబెటర్‌లోని E&ICT అకాడమీ కోర్సులు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నవారికి శిక్షణ అందిస్తుంది. అదే క్రమంలో డేటా సైన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, ఇతర ప్రత్యేక రంగాలలో ఉపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

READ ALSO : Heart Beat : నిమిషానికి 1,511 సార్లు గుండె కొట్టుకునే జీవి ఏంటో తెలుసా..?

అధికారిక ప్రకటన ప్రకారం, IIT గౌహతిలోని E&ICT అకాడమీ ద్వారా ఈ కోర్సులకు సంబంధించి మెటీరియల్ రూపొందించారు. అల్మాబెటర్ లో నమోదు చేసుకున్న వారు IIT గౌహతిలోని E&ICT అకాడమీ నుండి కోర్సు పూర్తి చేసుకున్న తరువాత ధృవీకరణ పత్రాలను అందుకుంటారు. ఈ ధృవీకరణ పత్రం IIT-సర్టిఫైడ్ గ్లోబల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కు లోపబడి ఉంటుంది.

READ ALSO : Viral Post : తండ్రిని రూ. 2 లక్షలకి అమ్మకానికి పెట్టిన కూతురు

ఈ కోర్సులు నేర్చుకునే వారు IIT గౌహతి టీచింగ్ ఫ్యాకల్టీ లు అందించే ఉపన్యాసాలు ,క్యాంపస్‌లో జరిగే క్యాంపస్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా టెక్ ఔత్సాహికులు , నిపుణులకు విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ కోర్సులను ఆల్మాబెటర్ తో కలసి IIT-గౌహతి సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.