AP EAMCET 2023 : ఈఏపీసెట్ (ఇంజినీరింగ్) వెబ్ ఆప్షన్ల ఎంపికకు గడువు పొడగింపు

కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన అభ్యర్ధులు ఆగస్ట్ 14వ తేది వరకు ఆప్షన్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆగస్ట్16న ఆప్షన్ల మార్పుకు అవకాశం కల్పించారు. 23న సీట్లు కేటాయింపు ఉంటుంది. 31 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

AP EAMCET 2023 : ఈఏపీసెట్ (ఇంజినీరింగ్) వెబ్ ఆప్షన్ల ఎంపికకు గడువు పొడగింపు

AP EAMCET 2023

Updated On : August 9, 2023 / 8:23 AM IST

AP EAMCET 2023 : ఈఏపీసెట్ (ఇంజినీరింగ్) అడ్మిషన్ల ప్రక్రియలో ఆప్షన్ల ఎంపికకు గడువును పొడిగించారు. ఆగస్ట్ 07నుండి ఈఏపీసెట్ 2023 కు సంబంధించి వెబ్ ఆప్షన్ ఎంట్రీని ప్రారంభమైంది. కొన్ని సాంకేతిక సమస్యల నేపధ్యంలో విద్యార్ధుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వెబ్ ఆఫ్షన్ల గడువును పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

READ ALSO : Yogivemana University : యోగివేమన విశ్వ విద్యాలయంలో దూరవిద్య కోర్సులు

పొడగించిన గడువు ప్రకారం కౌన్సిలింగ్ లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన అభ్యర్ధులు ఆగస్ట్ 14వ తేది వరకు ఆప్షన్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆగస్ట్16న ఆప్షన్ల మార్పుకు అవకాశం కల్పించారు. 23న సీట్లు కేటాయింపు ఉంటుంది. 31 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. కౌన్సెలింగ్ ప్రక్రియలో ముఖ్యంగా రిజిస్ట్రేషన్, కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ, సీట్ల కేటాయింపు, కాలేజీలో రిపోర్టింగ్ ఉంటాయి.

READ ALSO : Rahul Gandhi : నేడు అవిశ్వాస తీర్మానంపై మాట్లాడనున్న రాహుల్

అధికార యంత్రాంగం ఈఏపీసెట్ (ఇంజినీరింగ్) కౌన్సెలింగ్ ప్రక్రియను ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తోంది. ఈఏపీసెట్ (ఇంజినీరింగ్) 2023 కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు, సీట్ల లభ్యత ఆధారంగా జరుగుతుంది. సీట్లు కేటాయించిన అభ్యర్థులు చివరకుగా అడ్మిషన్ కోసం కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.