GATE-2023 Registration
GATE-2023 Registration : గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్-2023)కి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గడువు పొడగించారు. ఈ నెల 4వ తేదీ వరకు దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చు. నిజానికి గత నెల 30వ తేదీతో గడువు ముగిసింది. అయితే, పెద్ద సంఖ్యలో విద్యార్థుల నుంచి అందిన వినతుల మేరకు రిజిస్ట్రేషన్ గడువును మరో నాలుగు రోజులు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
గేట్-2023 నిర్వహణ కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) చేపడుతోంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో gate.iitk.ac.in వెబ్‌సైట్‌లో ఈ నెల 4వ తేదీలోపు ఎలాంటి లేట్ రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్-2023 అర్హత పొందిన అభ్యర్థులు ఇంజనీరింగ్ లేదా సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్-2023 ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో జరగాల్సివుంది.
NIFFT Admissions : ఎన్‌ఐఎఫ్‌ఎఫ్‌టీలో పీహెచ్‌డీ ప్రవేశాలు
గేట్-2023 ఈ ఏడాది 29 పేపర్లకు నిర్వహించనున్నారు. 29 పేపర్లతో పాటు అభ్యర్థులు గేట్ అప్లికేషన్ ప్రక్రియలో 2 పేపర్ కాంబినేషన్ కూడా ఎంచుకోవచ్చు. ప్రతి గేట్-2023 పేపర్ మొత్తం 100 మార్కులకు, జనరల్ ఆప్టిట్యూడ్ అన్ని పేపర్‌లకు (15 మార్కులు) సాధారణం. మిగిలిన పేపర్ సంబంధిత సిలబస్‌ను (85 మార్కులు) కవర్ చేస్తుంది.