NIFFT Admissions : ఎన్‌ఐఎఫ్‌ఎఫ్‌టీలో పీహెచ్‌డీ ప్రవేశాలు

రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉంటేనే ఇన్‌స్టిట్యూట్‌ స్కాలర్‌షిప్‌ లభిస్తుంది.

NIFFT Admissions : ఎన్‌ఐఎఫ్‌ఎఫ్‌టీలో పీహెచ్‌డీ ప్రవేశాలు

Nifft Admission

NIFFT Admissions : నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫాక్చరింగ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఎఫ్‌ఎఫ్‌టీ)లో డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నారు. ఫౌండ్రీ టెక్నాలజీ, ఫోర్జ్ టెక్నాలజీ విభాగాల్లో వివిధ పీహెచ్ డీ కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. ఫౌండ్రీ టెక్నాలజీలో సాలిడిఫికేషన్, క్యాస్టింగ్‌ డిజైన్‌, క్యాస్టింగ్‌ సిమ్యులేషన్‌, టూలింగ్‌ డిజైన్‌, అడ్వాన్స్‌డ్‌ ఫౌండ్రీ టెక్నాలజీ స్పెషలైజేషన్ లు ఉన్నాయి. ఫోర్జ్‌ టెక్నాలజీలో ఫోర్జింగ్‌ టెక్నాలజీ, ఫోర్జింగ్‌ డై డిజైన్‌, ఫోర్జింగ్‌ ప్రాసెస్‌ మోడలింగ్‌ అండ్‌ సిమ్యులేషన్‌, స్పెషల్‌ ఫోర్జింగ్‌ ప్రాసెస్‌ స్పెషలైజేషన్లు ఉన్నాయి.

దరఖాస్తుచేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఈ,ఎంటెక్‌,ఎమ్మెస్సీ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌,మెటలర్జీ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌, ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌, మాన్యుఫాక్చరింగ్‌ ఇంజనీరింగ్‌, ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌, ఫౌండ్రీ, ఫోర్జ్‌ టెక్నాలజీ, మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రథమ శ్రేణి మార్కులు తప్పనిసరిగా సాధించి ఉండాలి. కనీసం 75 శాతం మార్కులతో,బీఈ, బీటెక్‌, బీఎస్సీ ఇంజనీరింగ్‌,మెటలర్జీ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌, ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, మాన్యుఫాక్చరింగ్‌ , ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉంటేనే ఇన్‌స్టిట్యూట్‌ స్కాలర్‌షిప్‌ లభిస్తుంది. స్కాలర్‌షిప్‌ మొదటి రెండేళ్లు నెలకు రూ.31,000, చివరి రెండేళ్లు నెలకు రూ.35,000 అందిస్తారు. దరఖాస్తు ఫీజు వివరాలకు సంబంధించి జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500 ఫీజుగా చెల్లించాలి. దరఖాస్తులు అందజేసేందుకు ఆఖరు తేది జూన్‌ 30, 2022గా నిర్ణయించారు. రాతపరీక్ష జూలై 4, 2022 జరగనుంది. ఫలితాలను జూలై 29న వెల్లడిస్తారు. అడ్మిషన్లు ఆగస్టు 17న జరుగుతాయి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ ; nifft.ac.in పరిశీలించగలరు.