Site icon 10TV Telugu

రూ.65వేల జీతంతో మెట్రోలో ఉద్యోగాలు.. ఫుల్ డిటెయిల్స్..

Delhi Metro Recruitment 2025

Delhi Metro Recruitment 2025

Delhi Metro Recruitment 2025 : మెట్రోలో పనిచేయాలనుకునే వారికి ఇప్పుడు ఓ సువర్ణావకాశం. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సిస్టమ్ సూపర్‌వైజర్, సిస్టమ్ టెక్నీషియన్ ఖాళీలతో సహా మొత్తం 13 పోస్టులకు రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.

Read Also : RRB Group D : ఆర్ఆర్‌బీలో 32,438 పోస్టులకు నోటిఫికేషన్.. పది పాసైతే అప్లయ్ చేసుకోవచ్చు!

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) వివిధ ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు సమర్పణకు జనవరి 28 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలి. అయితే, ఈ మెట్రో ఉద్యోగాల దరఖాస్తుకు కొన్ని నియమాలు ఉన్నాయి. అభ్యర్థులు తప్పనిసరిగా ఈ అర్హతను కలిగి ఉండాలి. అవేంటో పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం.

మొత్తం ఎన్ని పోస్టులు? :
దేశ రాజధాని ఢిల్లీలో మెట్రో ఉద్యోగ అవకాశం. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సిస్టమ్ సూపర్‌వైజర్, సిస్టమ్ టెక్నీషియన్ ఖాళీలతో సహా మొత్తం 13 పోస్టులకు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు ఈ కింది వివరాలను తప్పక తెలుసుకోండి.

పోస్ట్‌ల గురించి పూర్తి వివరాలివే :
రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ : ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్.
పోస్టుల పేరు : సిస్టమ్ సూపర్‌వైజర్, సిస్టమ్ టెక్నీషియన్.

మొత్తం పోస్ట్‌లు :
దరఖాస్తు గడువు : జనవరి
గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు.
అప్లికేషన్ మోడ్ : పోస్ట్ లేదా ఇ-మెయిల్
నెలవారీ జీతం : ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.46వేల నుంచి రూ.65వేల వరకు చెల్లిస్తారు.

Read Also : RRB Group D : రైల్వేలో గ్రూపు-డి జాబ్స్ పడ్డాయి.. 32,438 పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పది పాసైనవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు..!

అర్హత వివరాలివే :
రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విద్యా బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి ఐటీఐ, డిప్లొమా లేదా బీఈ/బీ.టెక్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి :
దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు కనీస వయోపరిమితి 18ఏళ్లు, గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు.

రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఎలా ఉంది? :
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేరుగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి ఢిల్లీలో ఉద్యోగం కల్పిస్తారు. దీనికి ముందు అభ్యర్థులకు మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోండి. తదుపరి దరఖాస్తును ఢిల్లీ మెట్రో చిరునామాకు లేదా ఇమెయిల్ ద్వారా పంపవచ్చు.

Exit mobile version