చెక్ ఇట్ : తూర్పు రైల్వే లో అప్రెంటిస్ ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : February 15, 2020 / 05:34 AM IST
చెక్ ఇట్ : తూర్పు  రైల్వే లో అప్రెంటిస్ ఉద్యోగాలు

Updated On : February 15, 2020 / 5:34 AM IST

కోల్ కత్తా ప్రధాన కేంద్రంగా ఉన్న తూర్పు  రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ సెల్(RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తంగా 2792 ఖాళీలు ఉన్నాయి. డివిజన్ల వారీగా హౌరా, సీల్దా, మాల్డా, అసన్సోల్, కాంచ్రాపారా, లిలువా, జమాల్పూర్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు :
హౌరా డివిజన్ :
ఫిట్టర్ – 281
వెల్డర్ – 61
మెక్(MV) – 9
మెకానిక్ డీజిల్ – 17
బ్లాక్ స్మిత్ – 9
మెషినిస్ట్ – 9
కార్పెంటర్ – 9
పెయింటర్ – 9
లైన్ మెన్ – 9
వైర్ మెన్ – 9
రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్ – 8
ఎలక్ట్రీషియన్ – 220
మెకానిక్ మెషన్ టూల్ మెయిన్ టైన్స్ – 9

సీల్డా డివిజన్ :
ఫిట్టర్ – 185
వెల్డర్ – 60
ఎలక్ట్రీషియన్ – 91
లైన్ మెన్ – 40
వైర్ మెన్ – 40
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ – 75
రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్ – 35

మాల్డా డివిజన్ :
ఎలక్ట్రీషియన్ – 41
రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్ – 6
ఫిట్టర్ – 47
వెల్డర్ – 3
పెయింటర్ – 2
కార్పెంటర్ – 2

అసన్సోల్ డివిజన్ :
ఫిట్టర్ -151
టర్నర్ – 14
వెల్డర్ – 96
ఎలక్ట్రీషియన్ – 110
మెకానిక్ డిజిల్ – 41

కాన్ చారాపారా డివిజన్ :
ఫిట్టర్ – 66
వెల్డర్ – 39
ఎలక్ట్రీషియన్ – 73
మెషినిస్ట్ – 6
వైర్ మెన్ – 3
కార్పెంటర్ – 9
పెయింటర్ – 10

లిలూహ డివిజన్ :
ఫిట్టర్ – 80
మెషినిస్ట్ – 11
టర్నర్ – 5
వెల్డర్ – 68
పెయింటర్ – 5
ఎలక్ట్రీషియన్ – 15
వైర్ మెన్ – 15
రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండీషనింగ్ – 5

జమాలాపూర్ డివిజన్ :
ఫిట్టర్ – 260
వెల్డర్ – 220
మెషనిస్ట్ – 48
టర్నర్  – 48
ఎలక్ట్రీషియన్ – 43
డిజిల్ మెకానిక్ – 65

విద్యార్హత : అభ్యర్ధులు 10వ తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు : అభ్యర్ధుల వయసు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపికా విధానం : అభ్యర్దులను మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసి అభ్యర్ధులు రూ.100 చెల్లించాలి. SC,ST, దివ్యాంగులు, మహిళా అభ్యర్ధులకు మాత్రం ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ :ఫిబ్రవరి 21, 2020.
దరఖాస్తు చివరి తేదీ : మార్చి 20,2020.
ఎంపికైన అభ్యర్ధుల జాబితా ప్రకటన తేదీ : మార్చి 30, 2020.