ECIL: ఐటీఐ పూర్తి చేసిన వారికి బంపర్ ఆఫర్. ఈసీఐఎల్ (ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 412 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేయనుంది. దీనికి సంబందించిన ఆన్‌లైన్‌లో దరఖాస్తు పరిక్రియ ఇవాళ్టి నుండే మొదలుకానుంది(ECIL). అలాగే సెప్టెంబర్ 22తో ఈ గడువు ముగియనుంది. కాబట్టి.. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక పోర్టల్ www.ecil.co.in. దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సూచించింది.
Job Mela: రేపే మెగా జాబ్ మేళా.. విప్రో, యాక్సిస్ సంస్థల్లో 450 పైగా ఉద్యోగాలు.. అస్సలు మిస్ అవకండి
పోస్టులు, ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీలు 412. వాటిలో 16 పోస్టులు దివ్యాంగులకు కేటాయించబడ్డాయి.
విద్యార్హత:
అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయస్సు 31.10.2025 నాటికి 18 సంవత్సరాలు మించకూడదు. అలాగే సాధారణ అభ్యర్థుల గరిష్ట వయసు 25 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు మించకూడదు. ఇక దివ్యాంగులకు (PWD) కేటగిరీల ప్రకారం 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
ఐటీఐలో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అందులో ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకు 70% సీట్లను, ప్రైవేట్ ఐటీఐ విద్యార్థులకు 30% సీట్లను కేటాయిస్తారు. ఇక డాక్యుమెంట్ల వెరిఫికేషన్ తేదీని అభ్యర్థులకు మెయిల్ ద్వారా తెలియజేస్తారు.
అడ్రస్:
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్,
కార్పొరేట్ లెర్నింగ్ & డెవలప్‌మెంట్ సెంటర్ (CLDC),
నలంద కాంప్లెక్స్, ఈసీఐఎల్ (PO),
హైదరాబాద్ – 500 062.