EMRS Recruitment : ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో పోస్టుల భర్తీ దరఖాస్తు గడువు పొడిగింపు

వయోపరిమితి కూడా ఆయా పోస్టుల ను బట్టి నిర్ణయించారు. డిగ్రీ, డిప్లొమా, పీజీ, డీఈడీ, బీఈడీ, సీటెట్‌ తదితర విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

EMRS Apply Online

EMRS Recruitment : దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల(ఈఎంఆర్‌ఎస్)లో ఖాళీ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మొత్తం 10,391 ఖాళీల భర్తీకి సంబంధించి దరఖాస్తు గడువు ముగిసింది. అయితే తాజాగా దరఖాస్తు చేయలేకపోయిన వారికి మరోసారి అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకునేందుకు గడువును అక్టోబరు 19 వరకు పొడిగిస్తూ నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (నెస్ట్స్‌) నిర్ణయం తీసుకుంది.

READ ALSO : MLA Prasanna Kumar Reddy : చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

పోస్టుల వారీగా ఖాళీలను పరిశీలిస్తే ప్రిన్సిప‌ల్‌: 303 పోస్టులు , పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ): 2266 పోస్టులు, అకౌంటెంట్‌: 361 పోస్టులు, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (JNA): 759, ల్యాబ్‌ అటెండెంట్‌: 373 , ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ): 5,660 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఆయా పోస్టలను బట్టి అభ్యర్ధుల అర్హతలను నిబంధనల్లో పేర్కొన్నారు. వయోపరిమితి కూడా ఆయా పోస్టుల ను బట్టి నిర్ణయించారు. డిగ్రీ, డిప్లొమా, పీజీ, డీఈడీ, బీఈడీ, సీటెట్‌ తదితర విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; emrs.tribal.gov.in పరిశీలించగలరు.

READ ALSO : Narayanaswamy : భువనేశ్వరి, పురందేశ్వరిలపై డిప్యూటి సీఎం నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు

దరఖాస్తు చేసుకునే విధానం ;

ముందుగా అధికారిక వెబ్‌సైట్ emrs.tribal.gov.inని ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలో, “రిక్రూట్‌మెంట్”పై క్లిక్ చేయాలి. ప్రిన్సిపాల్/PGT/నాన్ టీచింగ్ స్టాఫ్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. అక్కడ మీకు సంబంధించిన వివరాలను నమోదు చేసి, దరఖాస్తును సబ్ మిట్ చేయాలి. అనంతరం ఫీజు చెల్లించి, పూర్తి చేసిన ఫారమ్‌ను సమర్పించాలి. భవిష్యత్తు అవసరాలకోసం డౌన్‌లోడ్ చేసుకోవటంతోపాటుగా ప్రింటవుట్ తీసుకొని ఉంచుకోవాలి.