అమెరికాలోని ఫార్మింగటన్ ఫేక్ యూనివర్శిటీ కేసులో అరెస్టు అయిన 8 మంది తెలుగు విద్యార్థులకు కోర్టులో ఊరట లభించింది. మొత్తం అరెస్టు అయిన 16 మందిని స్వచ్ఛందంగా స్వదేశాలకు వెళ్లిపొమ్మని కోర్టు తీర్పును ఇచ్చింది. విచారణ జరగడానికి ముందు వారంతా కేలహోన్ కౌంటీ, మన్రో కౌంటీ జైళ్లలో ఉన్నారు. ఈ కేసులో తుది వాదనలు మంగళవారం జరగగా.. ఫిబ్రవరి 26లోగా స్వదేశాలకు వెళ్లాలని విద్యార్థులను కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో 17మందిలో 15 మందికి వాలంటరీ డిపార్చర్ అవకాశం కల్పించింది. ఒకరికి ఇంతకుముందే వాలంటరీ డిపార్చర్ అవకాశం రాగా, మిగిలిన 15 మందితో కలిసి స్వచ్ఛందంగా ఫిబ్రవరి 26లోగా యూఎస్ వదిలి వెళ్లాల్లి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారంలో విద్యార్థులకి అమెరికన్ తెలంగాణ అసోసియేషన్(అటా-తెలంగాణ) పూర్తి అండగా నిలిచింది. విద్యార్థుల తరపున వాదించేందుకు అటార్నీలను ఏర్పాటు చేశారు. అంతేగాక విద్యార్థులకు సహకారం అందించాలంటూ కాంగ్రెస్ సభ్యురాలు ఎలిసా స్లాటికిన్‌కు వెంకట్ మంతెన ఆధ్వర్యంలో అటా- తెలంగాణ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
విద్యార్థులు తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారని.. అమెరికన్ తెలంగాణ అసోషియేషన్ పేర్కొంది. వారి ప్రయణానికి ఏర్పాట్ల విషయంలో ఇమిగ్రేషన్ అధికారులు సానుకూలంగా స్పందించారని అటా ప్రతినిధులు వెల్లడించారు.