ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లో 330 మేనేజర్ పోస్టులు

  • Publish Date - September 28, 2019 / 05:41 AM IST

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) 330 మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొదట మేనేజ్‌మెంట్ ట్రైనీగా 6 నెలలు శిక్షణ ఇస్తారు. అభ్యర్ధులను ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, టైనింగ్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 40వేలకు పైగా జీతం ఇస్తారు. ఆసక్తిగల అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
 
వయసు: 
అభ్యర్ధులు 18 నుంచి 28 ఏళ్లు మించకూడదు. మేనేజర్ (హిందీ) వారికి 35 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: 
జనరల్, OBC అభ్యర్ధులకు రూ.800 చెల్లించాలి. SC, ST అభ్యర్ధులకు మాత్రం ఫీజు లేదు.

విద్యార్హత: 
అభ్యర్ధులు డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసుండాలి. 

దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 28, 2019.

దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్ 27, 2019.

Read Also: జవహర్ నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం