ICF Sports Quota Recruitment : ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో స్పోర్ట్స్ కోటా ఖాళీల భర్తీ

అభ్యర్థులను ట్రయల్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Filling of sports quota vacancies in Integral Coach Factory

ICF Sports Quota Recruitment : ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. చెన్నైలోని ఈ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్పోర్ట్స్‌లో కోటాలో లెవెల్‌-1 ఉద్యోగాలను 2022-23 ఏడాదికి గాను నియమించుకోనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఫుట్ బాల్ (పురుషులు) , బాడీ బిల్డింగ్ (పురుషులు), కబడ్డీ (పురుషులు), హాకీ (పురుషులు), క్రికెట్ (పురుషులు), వెయిట్ లిఫ్టింగ్ (పురుషులు) వంటి క్రీడల్లో ప్రావీణ్యత ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి, ఐటిఐ ఉత్తీర్ణతతో పాటు వివిధ క్రీడాంశాల్లో క్రీడాకారులై ఉండాలి.

అభ్యర్థులను ట్రయల్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్/రిక్రూట్ మెంట్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై చిరునామాకు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ మార్చి 13వ తేదీని చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://pb.icf.gov.in/index.php పరిశీలించగలరు.

ట్రెండింగ్ వార్తలు