ICMR NJIL Recruitment
ICMR NJIL Recruitment : ఐసీఎం ఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ జల్మా ఇన్ స్టిట్యూట్ ఫర్ లెప్రసీ అండ్ అధర్ మైకోబ్యాక్టిరియల్ డిసీజెస్ (ఎన్ జే ఐఎల్) ఉత్తర ప్రదేశ్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 68 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Papaya Cultivation : బొప్పాయిసాగుకు అనువైన రకాలు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం
భర్తీ చేయనున్న పోస్టుల్లో టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్, టెక్నీకల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, డీఎంఎల్ టీ, ఇంజనీరింగ్ ఉత్తీర్ణులైన వారు అర్హులు. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
READ ALSO : Seed Selection Process : సాగుకు సిద్ధమవుతున్న రైతులు.. విత్తన సేకరణలో జాగ్రత్తలు
అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే వ్రాత పరీక్ష అధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 18,000 నుండి 1,12400రూ చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు తుదిగడువు 27 జులై 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://main.icmr.nic.in/ పరిశీలించగలరు.