Vacancies In Post Offices
Vacancies In Post Offices : కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పోస్టల్ శాఖలో పెద్దఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ పోస్టాఫీసుల్లో ఉన్న 40 వేల 889 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Pepper Help Cut Belly Fat : మిరయాలతో బొడ్డు చుట్టూ కొవ్వును తగ్గించడానికి అనుసరించాల్సిన మార్గాలు !
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదవతరగతి అర్హత ఉంటే సరిపోతుంది. దీంతో పాటు గణితం, ఇంగ్లీషు, స్థానిక భాషలో పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18-40 ఏళ్ల లోపుండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ, లేకుండా పోస్ట్ మాస్టర్, బ్రాంచ్ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
READ ALSO : Crave Crops : పంటలను ఆశించే చీడ పీడలను ఆకర్షించే ఎరపంటలు!
ఏపీలో 2480, తెలంగాణలో 1260 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 16 వరకూ ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు పోస్ట్ మాస్టర్, బ్రాంచ్ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
READ ALSO : Animal Diseases : వర్షాకాలంలో జీవాలకు ఆశించే వ్యాధులు నివారణ చర్యలు
ప్రారంభవేతనం 10 వేల నుంచి 12 వేలవరకూ ఉంటుంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగానికి 12 వేల నుంచి 29,380 రూపాయలుంటుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా డాక్ సేవక్ ఉద్యోగానికి 10 వేల నుంచి 24 వేల 470 రూపాయలుంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://indiapostgdsonline.gov.in/ పరిశీలించగలరు.