APGENCO Recruitment
APGENCO Recruitment : ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీ జెన్కో) పరిధిలోని థర్మల్ పవర్ ప్లాంట్లలో ఒప్పంద ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 26 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : CM Mamata banerjee : స్పెయిన్‌లో దీదీ జాగింగ్ వీడియో వైరల్ .. అదే చీరకట్టుతో చలాకీగా
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మొదటి శ్రేణిలో ఎంఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 35 సంవత్సరాలు మించకూడదు. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఎమ్మెస్సీలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఎంపికైన వారికి నెలకు 25,000రూ వేతనంగా అందజేస్తారు.
READ ALSO : వాట్సాప్‌లో డిలీటెడ్ మెసేజ్ ఇలా చూడొచ్చు!
ఎంపికైన వారు ఇబ్రహీంపట్నం(కృష్ణా జిల్లా), వీవీ రెడ్డి నగర్ (వైఎస్సార్ జిల్లా), నెలటూరు(ఎస్సీఎస్‌ఆర్ జిల్లా), ఎంసీఎల్ కోల్‌మైన్స్(ఒడిశా), ఎస్‌సీసీఎల్ కోల్‌మైన్స్(తెలంగాణ) తదితర ప్రాంతాలలో పనిచేయాల్సి ఉంటుంది. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబరు 21 ఆఖరు తేదిగా నిర్ణయించారు. దరఖాస్తు హార్డ్ కాపీలను పంపాల్సిన చిరునామా ; చీఫ్ జనరల్ మేనేజర్ (Adm., Ice & Arp.),3వ అంతస్తు, విద్యుత్ సౌధ,ఎపిజెన్ కో, విజయవాడ – 520 004. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://apgenco.gov.in/ పరిశీలించగలరు.