CM Mamata banerjee : స్పెయిన్‌లో దీదీ జాగింగ్ వీడియో వైరల్ .. అదే చీరకట్టుతో చలాకీగా
విదేశీ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జాగింగ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

Mamata banerjee Jogging in Spain
CM Mamata banerjee Jogging : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎప్పుడ చీరకట్టుతో వీపునిండా చెంగుతో హుందాగా ఉంటారు. ఆమె ఎప్పుడు అలాగే కనిపిస్తారు. 68 ఏళ్ల వయస్సులో కూడా చక్కటి ఫిట్ నెస్ తో చలాకీగా ఉంటారు. ఇక ఆమె సాధాణంగా నడిచినా ఆమె కూడా ఉండేవారు జాగింగ్ చేస్తున్నట్లుగా నడివాల్సిందే. అంత ఫాస్టుగా నడుస్తారామె. ఇక ఆమె జాగింగ్ చేస్తే కూడా ఉన్నవారు పరుగు అందుకోవాల్సిందే. ఆమె అంత చలాకీగా ఉంటారు. తాజాగా ఆమె చీరతో జాగింగ్ వీడియో వైరల్ అవుతోంది.
తాజాగా విదేశీ పర్యటనలో ఉన్న దీదీ చీరకట్టుతో జాగింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె స్వదేశీ పర్యటన అయినా విదేశీ పర్యటన అయినా ఆఖరికి తన సొంత రాష్ట్రంలో పర్యటించినా ఉదయాన్నే వాకింగ్ చేయటం ఆమె దినచర్యలో భాగం. విదేశీ పెట్టుబడుల కోసం దీదీ దుబాయ్, స్పెయిన్ లలో 12 రోజులు పర్యటించనున్నారు.
దీంట్లో భాగంగా దీదీ ప్రస్తుతం స్పెయిన్ లో ఉన్నారు. స్పెయిన్ లోని మాడ్రిడ్ లోని పర్యటిస్తున్న సందర్భంగా దీదీ ఉదయాన్నే జాగింగ్ చేసారు. చీరకట్టుతో, స్మార్ట్ వాచ్, రబ్బరు చెప్పులు ధరించి జాగింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీదీతో పాటు ఆ దేశానికి వెళ్లిన బృందం కూడా జాగింగ్ చేశారు.
దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాలో పోస్టు చేస్తు.. ‘మార్నింగ్ రిఫ్రెష్. ఉదయమే జాగింగ్ చేస్తే రోజుకు కావాల్సిన శక్తి వస్తుంది. అందరూ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండండి’ అంటూ కామెంట్ కూడా చేశారు. కాగా దీదీ ప్రతీరోజు ట్రెడ్‌మిల్‌పై జాగింగ్ చేస్తుంటారు. ఓసారి ఆమె డార్జిలింగ్ కొండల్లో 10 కిలోమీటర్లు జాగింగ్ చేసి ప్రకృతి పరిరక్షణ, ఆరోగ్యంపై అవగాహన కల్పించిన విషయం తెలిసిందే.
View this post on Instagram