ESIC Recruitment : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో ఎంబీబీఎస్/పీజీ/ఎండి/ఎం ఎస్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 40 నుంచి 50 ఏళ్లు మించకూడదు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను అకడమిక్ అర్హత, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- Guntupalli Ramakrishna
- Published On : October 19, 2022 / 07:53 PM IST
Filling up of job vacancies in Employees State Insurance Corporation
ESIC Recruitment : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 84 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు ఉన్నాయి. ఖాళీలకు సంబంధించి ప్రొఫెసర్ 9 ఖాళీలు, అసోసియేట్ ప్రొఫెసర్ 27 ఖాళీలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ 48 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో ఎంబీబీఎస్/పీజీ/ఎండి/ఎం ఎస్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 40 నుంచి 50 ఏళ్లు మించకూడదు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను అకడమిక్ అర్హత, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూను అక్టోబర్ 27వ తేదీన నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.esic.in/ పరిశీలించగలరు.
