SSC CPO Notification 2026 Out : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్నారా..? 1,871 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్.. అర్హతలు, జీతం వివరాలు ఇవే!
SSC CPO Notification 2026 Out : నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 1,871 ఖాళీలకు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) CPO 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
SSC CPO Notification 2026 Out
SSC CPO Notification 2026 Out : నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఢిల్లీ పోలీస్, కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. ఈ మేరకు మొత్తం 1,871 ఖాళీలకు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) CPO 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభంకాగా.. సెప్టెంబర్ 30వ తేదీ రాత్రి 11 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read : Telangana Govt : బీసీ మహిళలకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఈనెల 15వ తేదీ వరకే చాన్స్..
ఢిల్లీ పోలీస్‌లో సబ్ ఇన్స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులు భర్తీకి సంబంధించి.. పురుషులకు 205, మహిళలకు 112 చొప్పున మొత్తం 317 పోస్టులు ఉన్నాయి. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో సబ్ ఇన్స్పెక్టర్ (GD) పోస్టులు 1,320 ఉన్నాయి. వీటిలో పురుషులకు 1,173, మహిళలకు 147 పోస్టులు కేటాయించారు. CISFలో తొలిసారిగా సబ్ ఇన్స్పెక్టర్ (ఫైర్) పోస్టులను కూడా ఈ నియామకంలో చేర్చారు. ఈ కేటగిరీలో 234 పోస్టులు ఉన్నాయి.
ఎస్ఎస్సీ సీపీఓ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. వయస్సును 1 ఆగస్టు 2026 నాటికి లెక్కిస్తారు. రిజర్వేషన్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఈ పోస్టుల కోసం దరఖాస్తులకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు అవకాశం ఉండగా.. ఫీజు చివరి తేదీ అక్టోబర్ 1వ తేదీ రాత్రి 11గంటల వరకు అవకాశం ఉంటుంది. అక్టోబర్ 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సవరణకు అవకాశం ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీని తరువాత ప్రకటించనున్నారు. అభ్యర్థుల ఎంపికలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలతోపాటు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ), మెడికల్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి దశల ఉంటాయి.
పేపర్-1లో 100 ప్రశ్నలకు 100 మార్కులు, పరీక్ష సమయం ఒక గంటగా ఉంటుంది. పేపర్-2లో 160 ప్రశ్నలకు 320 మార్కులు ఉంటాయి. ఎంపికైన సబ్-ఇన్స్పెక్టర్లకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతంగా చెల్లిస్తారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు కూడా అందుతాయి. పూర్తి వివరాల కోసం https://ssc.gov.in/ సంప్రదించండి.
