SINP Recruitment : కేంద్ర ప్రభుత్వ సంస్ధ సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ లో పలు ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును అనుసరించి ఇంటర్(సీఏ/ సీఎస్ / సీడబ్ల్యూఏ), ఎంకాం, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్(సీఏ/ సీఎస్ / సీడబ్ల్యూఏ), ఎంకాం, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
- Guntupalli Ramakrishna
- Published on- August 5, 2023 / 01:48 PM IST
SINP Recruitment
SINP Recruitment : కోల్‌కతాలోని సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ సంస్ధ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన మొత్తం 3 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీసర్ ఖాళీ లు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : SDSC SHAR Recruitment : సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో వివిధ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును అనుసరించి ఇంటర్(సీఏ/ సీఎస్ / సీడబ్ల్యూఏ), ఎంకాం, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్(సీఏ/ సీఎస్ / సీడబ్ల్యూఏ), ఎంకాం, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఏఏవో పోస్టులకి 35 సంవత్సరాలు, ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీసర్ పోస్టులకి 40 సంవత్సరాలు వయోపరిమితిగా నిర్ణయించారు.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.09.2023గా నిర్ణయించారు. అప్లికేషన్ హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీగా 26.09.2023 నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.saha.ac.in/ పరిశీలించగలరు.
