SDSC SHAR Recruitment : సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో వివిధ పోస్టుల భర్తీ

హెవీ వెహికల్ డ్రైవర్-ఎ 14 పోస్టులకు సంబంధించి పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అందులో కనీసం 3 సంవత్సరాలు హెవీ వెహికిల్ డ్రైవింగ్ అనుభవం ఉండాలి. నెలకు వేతనంగా రూ.19,900- రూ.63,200 చెల్లిస్తారు.

Satish Dhawan Space Center

SDSC SHAR Recruitment :  శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 56 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులనుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Samantha : మయోసైటిస్ చికిత్స కోసం 25 కోట్లు ఖర్చుపెడుతున్న సమంత.. నిజమేనా..?

పోస్టుల వివరాలకు సంబంధించి క్యాటరింగ్ సూపర్‌వైజర్ 1 ఖాళీ ఉంది. దీని విద్యార్హతలకు సంబంధించి హోటల్ మేనేజ్‌మెంట్ డిగ్రీ హోటల్ మేనేజ్‌మెంట్ & కేటరింగ్ టెక్నాలజీ/ హాస్పిటాలిటీ & హోటటల్ అడ్మినిస్ట్రేషన్/ కేటరింగ్ సైన్స్ & హోటల్ మేనేజ్‌మెంట్. ఏడాది అనుభవం ఉండాలి. లేదంటే డిప్లొమా ఇన్ కేటరింగ్. మూడేళ్ల అనుభవం ఉండాలి. పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్. రెండేళ్ల అనుభవం ఉండాలి. నెలకు వేతనంగా రూ.35,400- రూ.1,12,400 చెల్లిస్తారు.

READ ALSO : friendship day 2023 : కోపం నీటిమీద రాత అయితే .. చెలిమి శిలమీద రాత అవుతుంది ..

నర్స్-బి 7 పోస్టులు ఉన్నాయి. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి మూడేళ్లకు తగ్గకుండా డిప్లొమా (నర్సింగ్) కోర్సు చేసి ఉండాలి. స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ సభ్యత్వం ఉండాలి. నెలకు వేతనంగా రూ.44,900- రూ.1,42,400 చెల్లిస్తారు. ఫార్మసిస్ట్-ఎ 2 పోస్టులు ఉన్నాయి. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ నుంచి రెండేళ్లకు తగ్గకుండా డిప్లొమా కోర్సు చేసి ఉండాలి. నెలకు వేతనంగా రూ.29,200- రూ.92,300 చెల్లిస్తారు.

READ ALSO : Neopolis Layout Kokapet: అందరి దృష్టి కోకాపేటపైనే.. అసలు నియోపోలిస్ అంటే అర్థం ఏంటి?

రేడియోగ్రాఫర్-ఎ 4 పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ డిప్లొమా (రేడియోగ్రఫీ) కోర్సు చేసి ఉండాలి. నెలకు వేతనంగా రూ.25,500- రూ.81,100 చెల్లిస్తారు. ల్యాబ్ టెక్నీషియన్-ఎ1 పోస్టు దీనికి అర్హతగా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఫస్ట్ క్లాస్ డిప్లొమా (మెడికల్ ల్యాబొరేటరీ) కోర్సు చేసి ఉండాలి. నెల వేతనంగా రూ.25,500 – రూ.81,100 చెల్లిస్తారు. ల్యాబ్ టెక్నీషియన్-ఎ(డెంటల్ హైజీనిస్ట్)1 పోస్టుకు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఫస్ట్ క్లాస్ డిప్లొమా (డెంటల్ హైజీన్) కోర్సు చేసి ఉండాలి. నెలకు వేతనంగా రూ..25,500 – రూ.81,100 చెల్లిస్తారు.

READ ALSO : Monsoons Diseases : వర్షకాలంలో మలేరియా, డెంగ్యూ వంటి అనారోగ్యకారకాల నుండి మీ పిల్లలను రక్షించుకోవటానికి చిట్కాలు !

అసిస్టెంట్(రాజ్‌భాష)1 పోస్టుకు 60 శాతం మార్కులతో డిగ్రీ. హిందీ టైపింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 25 పదాలు టైప్ వచ్చి ఉండాలి. ఇంగ్లిష్ టైపింగ్ తెలిసి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. నెలకు వేతనంగా రూ..25,500 – రూ.81,100 చెల్లిస్తారు. కుక్ 4 పోస్టులు ఉన్నాయి. పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. నెలకు వేతనంగా రూ.19,900- రూ.63,200 చెల్లిస్తారు. లైట్ వెహికల్ డ్రైవర్- ఎ 13 పోస్టులు ఉండగా పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. లైట్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. నెలకు వేతనంగా రూ.19,900- రూ.63,200 చెల్లిస్తారు.

READ ALSO : Dragon Fruit Cultivation : డ్రాగన్ ఫ్రూట్ సాగుతో సత్ఫలితాలు

హెవీ వెహికల్ డ్రైవర్-ఎ 14 పోస్టులకు సంబంధించి పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అందులో కనీసం 3 సంవత్సరాలు హెవీ వెహికిల్ డ్రైవింగ్ అనుభవం ఉండాలి. నెలకు వేతనంగా రూ.19,900- రూ.63,200 చెల్లిస్తారు. ఫైర్‌మ్యాన్-ఎ 8 పోస్టులకుగాను పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. నిర్దేశిత ఫిజికల్ ఫిట్‌నెస్ కలిగి ఉండాలి. నెలకు వేతనంగా రూ.19,900- రూ.63,200 చెల్లిస్తారు.

READ ALSO : Laptops Price in India : పీసీల దిగుమతులపై ఆంక్షల ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న ల్యాప్‌టాప్‌ల ధరలు..!

వయోపరిమితికి సంబంధించి పోస్టుల వారిగా 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరకాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హతలున్నవారు ఆగస్టు 24 లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.shar.gov.in/ పరిశీలించగలరు.