Financial assistance of Rs. 1.25 lakh to students under Prime Minister Yashasvi Scholarship
విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఓబీసీ, ఈబీసీ, డీఎన్‌బీ వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రీమియం స్థాయి విద్యను అందించడానికి టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్ స్కీమ్, పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీం ఫర్ వైబ్రంట్ ఇండియా (PM YASASVI) స్కాలర్‌షిప్‌ను అందించనుంది. ఈ స్కీమ్ కింద 9వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం రూ.1,25,000 స్కాలర్షిప్ ఇవ్వనున్నారు. ఇందులో ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఇతర ఖర్చులను అందించనుంది. ఈ మొత్తం స్కాలర్‌షిప్‌లలో 30 శాతం అమ్మాయిలకు కేటాయిస్తారు. అభ్యర్థులు తన దరఖాస్తును ఆగస్టు 31 లోగా సమర్పించాల్సి ఉంటుంది.
స్కాలర్‌షిప్ వివరాలు:
9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం రూ.75,000 వరకు స్కాలర్షిప్ అందిస్తారు.
11, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం రూ.1,25,000 వరకు స్కాలర్షిప్ అందిస్తారు.
అర్హతలు:
ఓబీసీ, ఈబీసీ, డీనోటిఫైడ్ ట్రైబల్ వర్గాలకు చెందిన విద్యార్థులు. అది కూడా వారు గత తరగతిలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వార్షిక ఆదాయం:
అభ్యర్థుల వార్షిక కుటుంబ ఆదాయం రూ.2.5 లక్షలు మించకూడదు.
పాఠశాల విధానం:
అలాగే ఈ స్కాలర్‌షిప్ కేవలం ఎంపిక చేసిన టాప్ క్లాస్ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది.
వయోపరిమితి:
9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల వయసు 13 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
అవసరమయ్యే ధ్రువీకరణ పత్రాలు:
కుల, కుటుంబ, ఆదాయ ధ్రువపత్రాలు, గత తరగతి మార్కుల మెమో, ఆధార్ నంబర్, విద్యార్థి బ్యాంకు ఖాతా వివరాలు, పాఠశాల నోడల్ ఆఫీసర్ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.