Forest Section Officer Jobs in Andhra Pradesh Forest Department
ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ శాఖలో ఖాళీగా ఉన్న 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఈ ప్రక్రియ తుది దశకు చేరింది. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా ఇవాళ్టితో(ఆగస్టు 17) ముగియనుంది. కాబట్టి, అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
విద్యార్హతలు: వృక్షశాస్త్రం/ఫారెస్ట్/హార్టీ కల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ/మ్యాథ్స్, స్టాటిస్టిక్స్/జియాలజీ/అగ్రికల్చర్ ఒక సబ్జెక్ట్ గా ఉండి డిగ్రీ పాసై ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు రుసుము: ప్రాసెసింగ్ ఫీజు రూ.250, పరీక్ష ఫీజు రూ. 80 చెల్లించాల్సి ఉంటంది.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 01.07.2025 నాటికి 30 మించకూడదు.
వేతన వివరాలు: నెలకు రూ. 32,670 నుంచి రూ.1,01,970 మధ్య ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఉంటుంది.