ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఈ బంపర్ ఆఫర్ మీకోసమే. ఉచిత వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగం కల్పించనున్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నర్సింగ్ కోర్సులు చేసిన వారికి జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు విజయనగరం జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు ఎం. అన్నపూర్ణమ్మ ప్రకటన చేశారు.
ఇందుకోసం పూర్తిగా ఉచిత శిక్షణ అందిస్తామని, ఇందుకోసం అభ్యర్థులు ముందే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఉద్యోగాలు జర్మనీ దేశంలో కాబట్టి జర్మన్ లాంగ్వేజిలో 8 నుంచి 10 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. ఈమేరకు విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి కేంద్రాలలో నర్సింగ్ (బిఎస్సినర్సింగ్/ జిఎన్.ఎం)లో డిగ్రీ పట్టా పొందిన షెడ్యూల్డు కులాలు, తెగల మహిళా యువత కోసం ఉచిత వసతి కలిపిస్తున్నాం అని తెలిపారు.
అర్హత, ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్ సైట్ http://naipunyam.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 7వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
విద్యార్హతలు:
బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి రెండేళ్ల క్లినికల్ అనుభవం ఉన్నవారు లేదా జియన్ఎం నర్సింగ్ పూర్తి చేసి మూడేళ్ల క్లినికల్ అనుభవం ఉన్నవారు అర్హులు
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 35 ఏళ్ల మించకూడదు. వారే ఈ ఉచిత శిక్షణకు అర్హులు.
శిక్షణ గడువు:
పూర్తి ఉచిత శిక్షణ ఉంటుంది. దాదాపు 8 నెలల నుంచి 10 నెలల వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం రవాణా ఖర్చులు ఏమి లేకుండా జర్మనీ పంపించి ఉద్యోగం ఇస్తారు.
వేతన వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ కరెన్సీ ప్రకారం నెలకు రూ.2 లక్షల వరకు జీతం అందిస్తారు.
ఎంపిక విధానం:
మూడు విభాగాల్లో ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులకు ముందు ప్రాథమిక స్క్రీనింగ్ ఉంటుంది. తరువాత ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. ఉద్యోగం నిర్ధారమైన తరువాత వీసా ప్రక్రియ ఉంటుంది.