Self-Employment Training: 16 కోర్సుల ఉచిత శిక్షణ.. ఉచిత భోజనం, వసతి.. పూర్తి వివరాలు మీకోసం

Self-Employment Training: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని జీఎంఆర్ ఫౌండేషన్, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కలిసి నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ అందించనున్నారు.

Self-employment training In Vijayanagaram

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని జీఎంఆర్ ఫౌండేషన్, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కలిసి నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ అందించనున్నారు. మొత్తం 16 కోర్సులలో ఉంచిత శిక్షణ అందించనున్నారు. ఈ మేరకు సంస్థ డైరెక్టర్ రాజేష్ అధికారిక ప్రకటన చేశారు. మరి ఈ కార్యక్రమంలో ఏయే కోర్సులు నేర్పిస్తున్నారు? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెల్సుకుందాం.

గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, జీఎంఆర్ నైరేడ్ యూనియన్ బ్యాంక్ సహకారంతో ఈ కార్యక్రమం జరుగనుంది. ఇందులో భాగంగా రీఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, కంప్యూటర్ అకౌంటింగ్, హౌస్ వైరింగ్, ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, ఎల్ఎంవి డ్రైవర్, సెల్‌ఫోన్ రిపేరింగ్ అండ్ సర్వీసింగ్, జనరల్ ఈడీపీ, ఉమెన్స్ టైలరింగ్, వస్త్ర చిత్రకళ, సీసీటీవీ కెమెరా ఇన్‌స్టాలేషన్, డెస్క్‌టాప్ పబ్లిషింగ్, టూవీలర్ మెకానిక్, బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్, మెన్స్ టైలరింగ్, కాస్ట్యూమ్ జ్యువెలరీ మేకింగ్ కోర్సులలో ఉచిత శిక్షణ అందించనున్నారు.

ఇక ఈ కోర్స్ మొదలయ్యే సమయం నుంచి పూర్తయ్యేంతవరకు ఉచితంగా విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం సదుపాయం కల్పించనున్నారు. అంతేకాకుండా.. కోర్స్ పూర్తయిన తర్వాత అవసరమైన వారికి బ్యాంకు నుంచి రుణాలు అందించే అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ కోర్సుల్లో భాగంగా ప్రతి నెల బ్యాచులు నిర్వహించనున్నారు. ఈ ఉచిత శిక్షణకు హాజరయ్యే నిరుద్యోగ యువతీ, యువకుల వయసు 18 సంవత్సరాలు నిండి 45 సంవత్సరాల లోపు ఉండాలని తెలిపారు. కాబట్టి, ఇది యువతకు మంచి అవకాశమని, తప్పకుండా అందరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.