TS EAMCET 2026 Result : తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలు వచ్చేశాయ్ .. టాపర్లు వీరే.. రిజల్ట్ తెలుసుకోండిలా..
TS EAMCET 2026 Result : రాష్ట్రంలో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఈఏపీసెట్–2026 ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి.
TS EAMCET 2026 Result
TS EAMCET 2026 Result : తెలంగాణ ఎప్‌సెట్ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్ -ఫార్మసీ) ఫలితాలు వచ్చేశాయి. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి. బాలకిష్ణారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తదితరులతో కలిసి కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ-హెచ్ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో ఫలితాలను విడుదల చేశారు.
Also Read : Rajinikanth : కమల్, విజయ్‌పై రజనీకాంత్ సంచలన కామెంట్స్.. అలాంటి నీచ రాజకీయాలు నేను చేయను
ఈ నెల 4 నుంచి 11 వరకు ఈఏపీసెట్ పరీక్షలు జరిగాయి. ఈ నెల 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు జరగ్గా ఈ నెల 9 నుంచి 11 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరిగాయి. ఇంజనీరింగ్ విభాగంలో 1,97,241 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 84,954 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాలను eapcet.tgche.ac.in వెబ్ సైట్ లో చూడొచ్చు.
ఇంజనీరింగ్ విభాగంలో..
ఎం. రుషి(ఉప్పల్) మొదటి ర్యాంక్ సాధించగా. అన్షుల్ (మూసాపేట) రెండో ర్యాంక్ సాధించారు. ఎం. వంశీధర్ రెడ్డి (పులివెందుల) మూడో ర్యాంక్ సాధించగా.. జె. రోషన్ మణిదీప్ రెడ్డి (గుంటూరు) నాల్గో ర్యాంకు సాధించాడు. ఎం. సాయినిఖిత్ (మహబూబ్ నగర్) ఐదో ర్యాంక్ సాధించగా.. ఎం. ఆస్నా (మేడ్చల్) ఆరో ర్యాంక్, శరద్ మహేశ్వరీ (బంజారాహిల్స్) ఏడో ర్యాంక్ సాధించారు. టి. శ్రేయాష్ రెడ్డి (కొండాపూర్) ఎనిమిదో ర్యాంక్, బొమ్మిరెడ్డి సమీరాజ్ రెడ్డి (ఎల్బీనగర్) తొమ్మిదో ర్యాంక్, రాపోలు జయంత్ శేఖర్ రెడ్డి (సుచిత్ర) పదో ర్యాంక్ సాధించారు.
అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో ముకరం అహ్మద్ (హైదరాబాద్) ఫస్ట్ ర్యాంక్, తాడురి సాయి వెంకట్ (ఎల్బీనగర్) రెండో ర్యాంకు, సాహితి (రంగారెడ్డి) మూడో ర్యాంకు సాధించినట్లు అధికారులు వెల్లడించారు.
ఫలితాలు వెల్లడి కావడంతో తదుపరి విద్యా సంవత్సర ప్రవేశాలకు సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ షెడ్యూల్‌ను కూడా ఉన్నత విద్యామండలి వచ్చే రెండు, మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించనుంది.
