GATE 2024 Application
GATE 2024 Application : గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్ 2024) దరఖాస్తు గడువును పొడిగిస్తూ బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు అక్టోబర్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 13గా ప్రకటించారు. అభ్యర్థులు అధికారిక సైట్ goaps.iisc.ac.in ని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.
READ ALSO : Safflower Cultivation : కుసుమలో అధిక దిగుబడి కోసం మేలైన యాజమాన్యం
గేట్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఇంజినీరింగ్, టెక్నాలజీ, సైన్స్, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరిగా పాసై ఉండాలి. ప్రస్తుతం మూడో సంవత్సరం లేదా ఆపైన చదువుతున్న అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు మొత్తం 1.37 లక్షలకు పైగా దరఖాస్తులు ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (గేట్ 2024) కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు అందాయి. IITలు మరియు IIScలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) మరియు డైరెక్ట్ డాక్టోరల్ ప్రోగ్రామ్‌లను అభ్యసించాలనుకునే అభ్యర్థులు గేట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
READ ALSO : Prevention of Pests : వరి, పత్తి పంటల్లో పురుగుల నివారణ
రాత పరీక్ష 3, 4, 10 మరియు 11 ఫిబ్రవరి 2024న నిర్వహించనున్నట్లు ఇప్పటికే తేదీలను ప్రకటించారు. అభ్యర్థులు 3 జనవరి 2024 నుండి అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీలపై అభ్యర్థులు అభ్యంతరాలను ఫిబ్రవరి 22 నుండి ఫిబ్రవరి 25, 2024 వరకు సమర్పించాల్సి ఉంటుంది. ఫలితాలు మార్చి 16, 2024న ప్రకటిస్తారు. సీబీటీ మోడ్‌లోమొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్ష ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే విధానం ;
ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.gate.iisc.ac.in ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలోకి వెళ్లి గేట్-2024 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. ఫోన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇమెయిల్ అడ్రస్ వంటి వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. ఆ తరువాత రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. గేట్ దరఖాస్తు ఫారమ్ ఓపెన్ చేసి అన్ని వివరాలను పొందుపరచాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. చివరగా దరఖాస్తు ఫారమ్‌ను సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.