GATE 2025 Exam Schedule Announced By IIT Roorkee
GATE 2025 Exam Schedule : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2025 కోసం పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ఫిబ్రవరి 1, 2, 15, 16, 2025 తేదీల్లో జరుగనుంది. గేట్ అభ్యర్థులు పరీక్ష షెడ్యూల్‌ను (gate2025.iitr.ac.in) వద్ద అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేయవచ్చు. గేట్ పరీక్షా ఫలితాలు మార్చి 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది.
గేట్ పరీక్ష మొత్తం 30 పేపర్‌లను కలిగి ఉంటుంది. ఇన్‌స్టిట్యూట్ జారీ చేసిన (GATE FAQ 2025) ప్రకారం.. గేట్ అభ్యర్థులకు రెండు పేపర్‌లను ఎంచుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రతి గేట్ 2025 పేపర్‌కు మొత్తం మార్కులు 100 మార్కులు, జనరల్ ఆప్టిట్యూడ్ విభాగం 15 మార్కులు, మిగిలిన 85 మార్కులు కోర్ పేపర్‌లను కలిగి ఉంటాయి. రెండు-పేపర్ ఎంపిక కోసంఅభ్యర్థులు ముందుగా ఒక ప్రైమరీ పరీక్ష పేపర్‌ను ఎంచుకోవాలి. అనుమతించిన వాటితో కలిపి రెండో పేపర్‌ను ఎంచుకోవచ్చు.
ఐఐటీ రూర్కీ గేట్ 2025 అప్లికేషన్ ఎడిట్ చేసుకునే సౌకర్యాన్ని నవంబర్ 20 వరకు పొడిగించింది. అంతకుముందు, దరఖాస్తు సవరణకు గడువు నవంబర్ 10 ఉండగా.. ఎడిట్ ఆప్షన్ కోసం కొన్ని ఫీల్డ్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఏవైనా మార్పులు చేయాలంటే అదనంగా రుసుము చెల్లించాల్సి వచ్చేది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఏవైనా దరఖాస్తు సవరణ కోసం రూ. 900 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇతర కేటగిరీలకు చెందిన వారు, అలాగే అంతర్జాతీయ విద్యార్థులు రూ.1,800 చెల్లించాలి.
ఐఐటీ రూర్కీ గేట్ 2025 పరీక్షా కేంద్రాల జాబితాకు 11 కొత్త నగరాలను చేర్చింది. భారత్ అంతటా అభ్యర్థులకు మరింత అందుబాటులో ఉంటుంది. కొత్తగా చేర్చిన నగరాల్లో బద్ది, ఉనా, పాలంపూర్, పుత్తూరు, భిల్వారా, దౌసా, హనుమాన్‌గఢ్, నంద్యాల, ఈరోడ్, కృష్ణగిరి పొల్లాచ్చి ఉన్నాయి.
మార్కింగ్ స్కీమ్ ప్రకారం.. ఎంసీక్యూ (MCQ) విభాగంలో ప్రతి తప్పు సమాధానానికి నెగటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు ఒక మార్కు ఎంసీక్యూకి మార్కులో మూడింట ఒక వంతు తొలగిస్తారు. రెండు మార్కుల ఎంసీక్యూకి మూడింట రెండు వంతుల మార్కు తగ్గింపు వర్తిస్తుంది. ఎంఎస్‌క్యూ లేదా (NAT) ప్రశ్నలకు తప్పు సమాధానాలకు నెగటివ్ గ్రేడింగ్ లేదని గమనించాలి.
Read Also : CBSE Date Sheet : త్వరలో సీబీఎస్ఈ 2025 బోర్డు పరీక్షల డేట్ షీట్ విడుదల.. పూర్తి వివరాలివే!