GATE 2026: గేట్​ 2026 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. రిజిస్ట్రేషన్ ప్రక్రియపై కీలక అప్డేట్.. డైరెక్ట్ లింక్ తో ఇలా అప్లై చేసుకోండి

GATE 2026: గేట్​ 2026 అధికారిక వెబ్‌సైట్‌ gate2026.iitg.ac.in ను ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహ‌తి ప్రారంభించింది.

GATE 2026 registration process to begin from August 25

గేట్​ 2026 కోసం ప్రిపేర్​ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. దీనికి సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌ gate2026.iitg.ac.in ను ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహ‌తి ప్రారంభించింది. ఆగస్టు 25, 2025 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకానుంది. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 25 వరకు కొనసాగనుంది. ఆలాగే ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 6 వరకు గడువు ఉంటుంది.

గేట్ 2026 పరీక్షల తేదీలు, వివరాలు:

  • 2026 ఫిబ్రవరి 7, 8 (శనివారం, ఆదివారం)
  • 2026 ఫిబ్రవరి 14, 15, (శనివారం, ఆదివారం)
  • పరీక్ష ఫలితాలను మార్చి 19, 2026న విడుదల చేస్తారు.

ఎవరు అర్హులు:

అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో మూడొవ సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ చదువుతున్న విద్యార్థులు అర్హులు.
ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్/హ్యుమానిటీస్‌లో ప్రభుత్వ ఆమోదం పొందిన డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
ఐఈ, ఐసీఈ, ఐఈటీఈ, ఏఈఎస్ఐ, ఐఐసీహెచ్ఈ, ఐఐఎం, ఐఐఐఈ వంటి ప్రొఫెషనల్ సొసైటీల నుంచి అర్హత పొందిన అభ్యర్థులు కూడా ఈ పరీక్షలు రాయొచ్చు. కానీ, వారి సర్టిఫికేషన్ తప్పనిసరిగా ఎంఓఈ/ఏఐసీటీఈ/యూజీసీ/యూపీఎస్సీ ద్వారా బీఈ/బీటెక్/బీఆర్చ్/బీప్లానింగ్ డిగ్రీకి సమానంగా ఆమోదించబడాలి. విదేశీ డిగ్రీ హోల్డ‌ర్లు/ అందుకు సమానమైన ప్రోగ్రాముల్లో మూడొవ సంవత్సరం/ అంతకంటే ఎక్కువ చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు.