Btech Students : బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్..! ఫెయిల్ అయినా సర్టిఫికెట్ జారీ..!

ప్రస్తుత విధానంలో ఏ ఒక్క సబ్జెక్టు తప్పినా ఆ విద్యార్థి బీటెక్‌ పట్టా పొందేందుకు అర్హుడు కాదు.

Btech Students : బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్..! ఫెయిల్ అయినా సర్టిఫికెట్ జారీ..!

Updated On : March 29, 2025 / 7:51 PM IST

Btech Students : బీటెక్ విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఫెయిల్ అయినా వారికి సర్టిఫికెట్ జారీ కానుంది. ఈ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. సగం క్రెడిట్లు సాధిస్తే చాలు సర్టిఫికెట్ ఇవ్వాలని యోచిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలను రూపకల్పన చేయనుంది ప్రభుత్వం.

బీటెక్ నాలుగేళ్ల కోర్సు. అయితే, నాలుగేళ్లు బీటెక్‌ చదివిన విద్యార్థి ఒక్క సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినా బీటెక్ పట్టా ఇవ్వరు. దాంతో ఆ విద్యార్థి నాలుగేళ్ల కాలం వేస్ట్ అయినట్లే. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇక నుంచి అలా కాకుండా బీటెక్ ఫెయిల్ అయినా సర్టిఫికెట్ జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Also Read : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిగ్ అప్‌డేట్‌.. వారికి తక్షణమే రూ. లక్ష చెల్లింపు

అదెలా అంటే.. నాలుగేళ్ల బీటెక్ కోర్సులో సగం క్రెడిట్లు.. అంటే 50 శాతం సబ్జెక్టులు పాసైనా ఆ మేరకు ఓ సర్టిఫికెట్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. నాలుగేళ్ల బీటెక్‌లో 160 క్రెడిట్లు ఉంటాయి. ఒక్కో సెమిస్టర్‌కు 20 క్రెడిట్లు ఇస్తారు. కనీస మార్కులతోనైనా అన్ని సబ్జెక్టులు పాసైతే వారు 160 క్రెడిట్లు సాధించినట్లే. సెమిస్టర్‌కు ఐదారు సబ్జెక్టులుంటాయి. వాటిలో సగం పాసైతే 80 క్రెడిట్లు పొందుతారు.

ప్రస్తుత విధానంలో ఏ ఒక్క సబ్జెక్టు తప్పినా ఆ విద్యార్థి బీటెక్‌ పట్టా పొందేందుకు అర్హుడు కాదు. ఈ విధానంలో మార్పులు తేవడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కొత్త విధానంతో సగం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధిస్తే విద్యార్థులకు సర్టిఫికెట్ వస్తుంది. దాంతో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త విధానంపై త్వరలో విధివిధానాలను రూపొందించనుంది సర్కార్. ఈ విధానం అమల్లోకి వస్తే బీటెక్ విద్యార్థులకు భారీ ఊరట దక్కినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.